షూటింగ్ లేదు కదాని ఇంట్లో టైమ్ పాస్ చెయ్యకుండా స్వకార్యంతో పాటు స్వామికార్యం కూడా చేస్తూ ప్రాజెక్టస్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు సుకుమార్ . చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలందరూ కొరటాల డైరెక్షన్ లో సినిమాలు చెయ్యాలని ఆశపడుతున్నారు. షార్ట్ స్పాన్ తో పాటు తక్కువ సినిమాలతో స్టార్ డైరెక్టర గా క్రేజ్ తెచ్చుకున్నాడు కొరటాల. ప్రజెంట్ కొరటాల చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు.షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి దసరాకి సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.
సినిమా సినిమాకీ బాగా టైమ్ తీసుకుని అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్ గా రెడీ చేసుకున్నాకే సినమా స్టార్ట్ చేసే ఈ డైరెక్టర్ ఇప్పుడు లాక్ డౌన్ పీరియడ్ అవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నాడు . ఏదో కరోనా తో ఇంట్లో టైమ్ పాస్ చేద్దాం అనుకోకుండా ఇంటిపనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా చేసుకుంటున్నాడు .ఇంట్లో ఉండి ఇంటి పని చెయ్యడమేకాదు.. తన నెక్ట్స్ సినిమాకి అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడు.
అదేంటి.. అసలు ఆచార్య ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా అనుకుంటున్నారా..? అవును అవ్వలేదు కానీ .. మొన్నీమద్యే కొరటాల సినిమాలు ఫాస్ట్ గా చేస్తానని అనౌన్స్ చేశాడు ఇప్పటికే నా సినిమా వచ్చి రెండేళ్లయ్యింది. ఈసారి నుంచి అంతటైమ్ తీసుకోను.. వరుసగా సినిమాలు చేస్తానని చెప్పాడు కొరటాల. అంతేకాదు.. కమిట్ అయిన అన్ని సినిమాలు కంప్లీట్ చేసి 5 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతానని కూడా అంటున్నాడు. మరి ప్రస్తుతం కొరటాల రాసే స్క్రిప్ట్ ఎన్టీఆర్ కోసమా, రామ్ చరణ్ కోసమా..? లేక మహేష్ బాబు కోసమా చూడాలి.