గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన చిత్రాల పరిధి పెరిగింది. తెలుగు సినిమాలకి హిందీలో బాగా గిరాకీ పెరిగింది. ఇక్కడి సినిమాలని హిందీలో డబ్ చేసి వదిలితే యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో సరిగ్గా ఆడని చిత్రాలకి కూడా అక్కడ మిలియన్స్ లో వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీంతో హిందీ నిర్మాతల కన్ను మన సినిమాలపై పడింది.

 

తెలుగులో హిట్ అయిన చిత్రాలని హిందీలో రీమేక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. కబీర్ సింగ్, సింబా చిత్రాలు హిందీలో ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించాయో తెలిసిందే. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న చిత్రాల జాబితా చూసుకుంటే చాలా పెద్దగానే ఉంది. భాగమతి, ఆర్ ఎక్స్ ౧౦౦, జెర్సీ, మొదలగు చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. ఇంకా కొన్ని చిత్రాలని పరిశీలిస్తున్నారు. అయితే ఈ రీమేక్ ల లిస్ట్ లో మరో చిత్రం కూడా చేరనుంది.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా చేసిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాని హిందీలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది. రణ్ బీర్ కపూర్ ఇప్పటి వరకూ అన్నీ క్లాస్ సినిమాలే చేశాడు. అతని లుక్స్ కూడా అలాగే ఉంటాయి.

 

అందువల్ల ఇస్మార్ట్ శంకర్ సినిమా రీమేక్ లో రణ్ బీర్ సెట్ అవడేమో అంటున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు రామ్ కూడా చాక్లెట్ బాయ్ పాత్రలే చేశాడు. ఇస్మార్ట్ శంకర్ చేసేటపుడు రామ్ ఏంటి.. పూరితో మాస్ సినిమా ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. కానీ సినిమా రిలీఝ్ అయ్యాక రామ్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. పూర్తి మాస్ లుక్ లో రామ్ అదరగొట్టాడు. అందువల్ల కరెక్ట్ డైరెక్టర్ దొరికితే రణ్ బీర్ కపూర్ కి ఈ సినిమా సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: