ఖాళీగా ఉన్నాడు కదా..  మంచి కథ చెప్పి మహేష్ ని ఇంప్రెస్  చేద్దామనుకున్న డైరెక్టర్లు .. ఇక మనకు ఛాన్స్ ఇప్పుడప్పుడే రాదులే అనుకుంటూ నీరసపడిపోతున్నారు . ఎన్నాళ్లనుంచో మిగతా డైరెక్టర్లందరూ ప్లాన్ చేసుకుంటున్న సూపర్ స్టార్ సినిమా ఒక్కసారిగా తలకిందులైపోయింది.

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేశాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత నెక్టస్ సినిమా మహేష్ దే అని అఫీషియల్ గా ప్రకటించాడు . అసలే ఆయన సినిమాలు సంవత్సరాల తరబడి  చేస్తూనే ఉంటాడు.  ఆ దెబ్బతో మహేష్ తో ఆల్రెడీ సినిమా చేద్దామనుకుని స్కెచ్ లువేసుకున్న డైరెక్టర్లకి దిమ్మతిరిగిపోయింది.  ఖాళీగా ఉన్నాడు కదా.. కథలు చెబుదాం అనుకున్న డైరెక్టర్లకి అసలు ఆ ఛాన్సే  లేకుండా పోయింది. 

 

మహేష్ బాబు ఆశపెట్టి అంతలోనే అందకుండా చేశాడంటున్నారు డైరెక్టర్లు. మా సినిమా ఆశల మీదనీళ్లు చల్లేశాడు.. ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న ఆ అవకాశాన్ని ఇప్పుడప్పుడే లేకుండా చేశాడు  అనుకుంటున్నారు. ఆల్రెడీ  మహేష్ మీద ఆశలు పెట్టుకున్న, త్రివిక్రమ్,  కొరటాల, ప్రశాంత్ నీల్. మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్ తో సినిమా చేస్తాడన్న టాక్ నడుస్తోంది. రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యేసరికి పరశురామ్ తో చేయ్యబోయే సినిమా కూడా ఆల్ మోస్ట్  కంప్లీట్ అయిపోయేఛాన్సుంది.

 

మహేష్ పరశురామ్ తో సినిమా ప్లాన్ చేస్తాడు సరే . ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేద్దామనకున్నాడు కొరటాల. ఎందుకంటే .. మహేష్ , కొరటాల కాంబినేషన్లో సూపర్ హిట్స్ డెలివర్ అయ్యాయి కాబట్టి.. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేద్దామనుకున్నారు కొరటాల, మహేష్ బాబు. కానీ రాజమౌళి సినిమా వల్ల ఇప్పుడు ఈ సినిమా వెనక్కి వెళ్లిపోయింది.

 

కొరటాలతో పాటు .. త్రివక్రమ్ కూడా మహేష్ బాబుతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు . అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం మహేష్ బాబుతో అతడు,  ఖలేజా సినిమాలు  చేశాడు త్రివిక్రమ్. మళ్లీ ఇప్పటి వరకూ ఆ కాంబినేషన్ కుదరలేదు. సో .. ఇంత గ్యాప్ తర్వాత మరోసార ఈ మ్యాజిక్ ని రిపీట్ చేద్దామని మహేష్ కోసం కథ కూడారాసుకున్నాడట త్రివిక్రమ్. కానీ అదికథగానే మిగిలిపోయేలా ఉంది.

 

మహేష్ బాబుతో సినిమా చేద్దామని తెలుగు డైరెక్టర్లే కాదు .. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తెగ ఆరాటపడుతున్నాడు. కెజిఎఫ్ 2 చేస్తున్న టైమ్ లోనే మహేష్ తోసినమా గురించి మైత్రి మైవీస్ ని అప్రోచ్ అయ్యాడట ప్రశాంత్. నిజానికి మైత్రి దగ్గర మహేష్ బాబు డేట్స్ కూడా ఉండడంతో ప్రశాంత్ తో సినిమా ఫైనల్ అయిపోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ దరిదాపుల్లో కూడా ఆ ఛాన్స్ లేదు ప్రశాంత్ నీల్ . మళ్లీ వీళ్ల ప్లాన్లన్నీ ఎప్పుడు వర్కవుట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: