స‌మంత దాదాపు 250కి పైగా సినిమాల్లో న‌టించింది. మొద‌ట్లో స‌మంత మోడ‌లింగ్ చేసేది.  2007లో ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌డానికి ఒప్పుకున్న‌ప్ప‌టికీ త‌న తొలి చిత్రం ఏమాయ చేశావె సినిమాతో 2010తో తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. ఆ పై ఆమె న‌టించిన బృందావ‌నం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మ‌నసు, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అత్తారింటికి దారెది, రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, యుట‌ర్న్‌, ఓ బేబి, జాను చిత్రాల‌తో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని తెచ్చుకుంది. స‌మంత 1987 ఏప్రిల్ 28న త‌మిళ‌నాడులోని చెన్నైలో ప‌ల్ల‌వ‌రం అనే జిల్లాలో జ‌న్మించింది. ఈమె అస‌లు పేరు స‌మంత రూత్ ప్ర‌భు ఈ రోజు స‌మంత పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇండియా హెరాల్డ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ...ఓ సారి ఆమె కెరియ‌ర్ పై ఓ లుక్కేద్దాం. 

 

అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత స‌మంత కాస్త అక్కినేని స‌మంత రూత్ ప్ర‌భుగా మారింది. స‌మంత చ‌దువు మొత్తం చెన్నైలోని కామ‌ర్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది. మొద‌ట్లో స‌మంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి మోడ‌ల్‌గా ప‌నిచేసేది. స‌మంత సినిమాల్లోకి రావ‌డం మొద‌ట్లో ఇంట్లో ఎవ్వ‌రూ ఒప్పుకోలేదు. కానీ ఈ ఒక్క సినిమానే అని ఒప్పించింది. స‌మంత యాడ్స్ చూసి గౌత‌మ్ మీన‌న్ ఆమెను ఆడిష‌న్ కోసం పిలిపించారు. కానీ స‌మంత మొద‌టిసారి పిలిచిన‌ప్పుడు వెళ్ళ‌లేదు. అయితే మ‌రోసారి గౌత‌మ్‌మీన‌న్ పిలుపు పంపించారు. కానీ ఆమె ఆయ‌న త‌న‌ను సెలెక్ట్ చెయ్య‌రేమో అన్న‌భ‌యంతో ఆడిష‌న్‌కి వెళ్ళ‌లేదు. స‌మంత‌ను ఆయ‌న అసిస్టెంట్లు ఆడిష‌న్ చేయ‌గా అవి చూసి గౌత‌మ్ ఓకే చేశారు. గ‌తంలో న‌టించిన త‌మిళ చిత్రం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. విడుద‌ల కాలేదు. మ‌ళ్ళీ ఈ సినిమా అంటున్నావ్ అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ స‌మంత ప‌ట్టువిడ‌వ‌కుండా ఇంట్లోవారిని ఒప్పించింది. 

 

ప‌న్నెండుకోట్లు పెట్టి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 40 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సినిమాతో స‌మంత బాగా ఫేమ‌స్ అయింది. స‌మంత బెస్ట్ జ్యూరీ అవార్డును కూడా అందుకుంది. ఆ సంవ‌త్స‌రంలోనే ఎన్టీఆర్ స‌ర‌స‌న బృందావ‌నం చిత్రంలో న‌టించింది స‌మంత‌. ఇలా స‌మంత సినిమా కెరియ‌ర్ టాప్ సినిమాల‌తో టాప్ హీరోల‌తో మొద‌ల‌యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: