కరోనా భయంతో ప్రస్తుతం అందరూ లాక్ డౌన్ పాటిస్తూ స్వీయ గృహ నిర్భందంలో ఉంటున్న పరిస్థితులలో సామాన్యుడు నుండి సెలెబ్రెటీ వరకు ఒక రకమైన వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈవేదాంత ప్రభావం చిరంజీవి పై కూడ ఎలా పనిచేస్తోంది అని చెప్పే విధంగా చిరంజీవి ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకృతి పై చేసిన కామెంట్స్ ఆయనలో  అంతర్లీనంగా పెరిపోతున్న వేదాంతానికి నిదర్శనం అనుకోవాలి.


ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సమస్య గురించి మాట్లాడుతూ దురాశతో ప్రకృతిని దుర్వినియోగం చేసినందుకు కోపగించుకున్న ప్రకృతి మానవాళికి ఇచ్చిన శాపంగా ఈకరోనా అని తాను భావిస్తున్నాను అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఎవరికి వారు తమతమ స్థాయిలలో ప్రకృతికి ద్రోహం చేసామని దానిఫలితం ఈరోజు అందరం అనుభవిస్తున్నామని చిరంజీవి కామెంట్స్. 


అందరూ ఇంటికి పరిమితం అయ్యాక మన గతజీవితం గురించి ఆలోచించే తీరిక దొరకండంతో కుటుంబ బంధాల విలువ అందరికీ తెలిసి వచ్చింది అంటూ ఒకవిధంగా కరోనా మానవాళికి పాఠాలు నేర్పింది అని తన అభిప్రాయాన్ని వెళ్ళడించాడు. మధ్య తరగతి కుటుంబం నుండి తాను రావడంతో తమ తండ్రి సంపాదించే సంపాదన సరిపోవక తామంతా చిన్నప్పుడు ‘ఒక పులుసు – చారు – మజ్జిగ’ తో గడిపిన రోజులు తనకు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో గుర్తుకు వస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 


ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ పై ఆధారపడ్డ 14 వేల మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయని వారంతా షూటింగ్ లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి అమితాబ్ బచన్ తెలుగు సినిమా కార్మికుల కోసం 1500 వందలు విలువగల 12 వేల ఓచర్లు పంపిన విషయాన్ని బయటపెడుతూ ఇంకా తాను తెలుగు ఇండస్ట్రీ సినిమా కార్మికుల కోసం చాల చేయలవలసి ఉంది అన్న విషయం తనకు అమితాబ్ సహాయం గుర్తుకు చేసింది అని అంటున్నాడు. ఇక ‘ఆచార్య’ మూవీలో మరో హీరో పాత్రలో చరణ్ నటిస్తాడా లేదా మహేష్ నటిస్తాడా అన్న విషయం పై స్పందిస్తూ ‘త్వరలోనే చూస్తారుగా’ అన్న మాటను బట్టి మహేష్మూవీ ప్రాజెక్ట్ నటించే విషయంలో ఇంకా ఆలోచనలు కొనసాగుతున్నాయనే అని పిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: