స‌మంత.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ‘ఏమాయ చేసావె’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన స‌మంత‌. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. అందుకు త‌గ్గ‌ట్టుగా స‌మంత‌కు అవకాశాలు వరుస కట్టాయి. ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు అందుకుని.. త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

IHG

నిజానికి సినిమా పరిశ్రమలో లక్కీ లేడీ అనిపించుకోవడం అంత తేలికేం కాదు. తొలి సినిమాతో వచ్చిన చరిష్మాను కొనసాగించడం అనుకున్నంత తేలిక కాదు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంది సమంత. . ప్రతి సినిమాతోనూ ఓ మెట్టు ఎక్కింది సమంత. అటు కమర్షియల్‌ కథలకి తగ్గ కథానాయికగా... నటనకి ప్రాధాన్యమున్న పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తూ స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇక  ‘ఏమాయ చేసావె’ చిత్రం సమయంలో చైతన్య, సమంత మధ్య స్నేహం చిగురించింది. 

IHG

తర్వాత అదే ప్రేమగా మారింది. ఇద్దరు పెద్దలను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కినేని వారింటి కోడలిగా మారిన తరువాత కూడా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇక పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. 

IHG

అయితే ఈ భామకు అందం, అభినయంతో హృదయాలను కొల్లగొట్టడమే కాదు..కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కూడా బాగా తెలుసు. ప్రత్యూష సపోర్ట్‌ ఫౌండేషన్స్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారుల కన్నీరు తుడిచారు సమంత. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడ్డారీమె. అలాంటి స‌మంత నేడు పుట్టిన‌రోజు జ‌ర‌పుకుంటుంది. ఈ సంద‌ర్భంగా స‌మంత స్పెష‌ల్ ఫోటోలు మీ కోసం..

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

సమంతో స్పెష‌ల్ ఫోటోస్‌

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: