అగ్ర హీరోల తో సినిమా ఆఫర్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కొందరు హీరోయిన్ లకు. ఇక అగ్ర నిర్మాతలతో ఒక్కసారి సినిమా చేసే అవకాశం వచ్చి ఆ సినిమా హిట్ అయింది అంటే చాలు ఇక ఆలోచించుకునే పని ఉండదు. అలా అగ్ర హీరోయిన్ గా అయిపోవచ్చు. చాలా మంది హీరొయిన్ లు ఇలా అగ్ర హీరోయిన్ లు అయిన వాళ్ళే. చిన్న చిన్న హీరోయిన్ లు నటన రాని వాళ్ళు కూడా అగ్ర హీరోయిన్ అయిపోయారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతు ఉంటుంది. ప్రస్తుతం మన తెలుగులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లు అగ్ర హీరోయిన్ లు గా ఉన్నారు. 

 

అంత కు ముందు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సమంతా. ఆమె నిర్మాతల పాలిట ఒక వరం అని అంటూ ఉంటారు. ఆమె తో సినిమా చేయడానికి నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉండే వారు అని ఆమె చాలా సినిమాలలో కొందరు హీరోలకు నిర్మాతలకు లక్కీ గా మారిందని అంటూ ఉంటారు. టాలీవుడ్ లో సమంతా ఒకానొక సమయంలో వరుస ఆఫర్ల తో దూసుకుపోయింది అదే సమయంలో ఆమెకు కమర్షియల్ హీరోయిన్ అనే గుర్తింపు కూడా వచ్చింది. ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇంత తక్కువ కాలంలో ఏ హీరోయిన్ కి కమర్షియల్ గుర్తింపు రాలేదు. 

 

నష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆమె తో సినిమా చెయ్యాలి అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని అంటూ ఉంటారు. అగ్ర హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో భారీ రేటు ఇచ్చి ఆమె తో సినిమా చెయ్యాలి అనుకున్నారట దిల్ రాజు. అతను అప్పుడు నష్టాల్లో ఉన్నాడని అందుకే సినిమా చెయ్యాలి అనుకున్నారని అంటారు.  అలా చాలా మందికి ఆమె లక్కీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: