అక్కినేని సమంత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడమే  కాదు ఫిట్నెస్ విషయంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇక ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిస్తూ ఉంటుంది అక్కినేని వారి కోడలు సమంత. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడు మరింత జోరు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ అమ్మడు పట్టుకున్నదల్లా  బంగారం అయిపోతుంది. చేసిన ప్రతి సినిమా భారీ విజయాలను అందుకుంది. దీంతో పెళ్లి తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ మరింత పెరిగిపోయింది అనే చెప్పాలి. కథల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది సమంత. 

 

 

 అయితే సినీ ప్రముఖులు అన్న తర్వాత కేవలం సినిమా  తో పాటు నిర్మాణ సంస్థల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తు  తమ లక్కుని పరీక్షించుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు . ఇక తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ లవ్వబుల్ కపుల్  అయిన నాగచైతన్య సమంత జోడి కూడా తాజాగా ఇలాంటి ఆలోచన చేయబోతున్నారట. అయితే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 కానీ నాగచైతన్య సమంత జంట మాత్రం తమకు ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ హౌస్ ఉంటే బాగుంటుందనే ప్లాన్ చేస్తున్నారట. దీనికి ముందుగా సమంత ప్లాన్ చేస్తే దీన్ని చైతూ  ఆచరణలో పెట్టే పనిలో పడ్డాడట. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్  హల్చల్ చేస్తూనే ఉంది. ఇలా ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి  కొత్త టాలెంట్ ను  ఎంకరేజ్ చేయాలని సమంత నాగచైతన్య జోడి భావిస్తున్నారట. కొత్త టాలెంట్ ఎంకరేజ్  చేయడంతో పాటు చిన్న చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నిర్మించాలని ఈ  జోడి సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఇద్దరు ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తే  అది నాగార్జున కు పోటీగా వస్తుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: