కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ తెలుగు లో నారప్పగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ కమర్షియల్ మూవీ కాకపోయినా.. బ్లాక్ బస్టర్ సాధించింది. రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ మూవీ రిమేక్ కి తెలుగు, హిందీ సినీ పరిశ్రమలు రెడీ అయ్యాయి.  గత కొంత కాలంగా ఎక్కువగా రిమేక్ మూవీస్ కే ప్రాధాన్య ఇస్తున్న విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో నటిస్తున్నారు.  నారప్ప అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. మొదటి నుంచి రీమేక్ చిత్రాలకి వెంకటేశ్ ఎక్కువ ప్రాధాన్యతస్తూ వచ్చారు. ఆయన కెరియర్లో భారీ విజయాలను అందుకున్న చిత్రాలలో రీమేక్ మూవీ సంఖ్య ఎక్కువగానే వుంది.  

 

తాజాగా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో కరోనా మహ్మారి ప్రబలిపోవడంతో వాయిదా పడింది.  అయితే షూగింగ్ కోసం విక్టరీ వెంకటేశ్ పూర్తిగా బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు తన గెటప్ కూడా చెంజ్ చేశారు.   లాక్ డౌన్ కారంణగా ఎన్నో సినిమాలో రిలీజ్ కాలేదు.. వాయిదా పడ్డాయి.  అలాగే షూటింగ్స్ కూడా అన్నీ వాయిదా పడటంతో సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు.  అయితే నారప్ప షూటింగ్ లాక్ డౌన్ పూర్తి కాగానే ఉండబోతుందని అంటున్నారు.

 

 లాక్ డౌన్ తరువాత అనంతపురంలో అవుట్ డోర్ షెడ్యూల్ వుంది. కొన్ని సన్నివేశాలను అక్కడే చిత్రీకరించవలసి ఉందట. అవి సెట్ వేసి తీసే సీన్స్ కాదు. అందువలన లాక్ డౌన్ తరువాత పరిస్థితులను చూసుకుని, ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.  గత కొంత కాలంగా మల్టీస్టార్ మూవీలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ ‘గురు’ తర్వాత సోలోగా నటిస్తున్న మూవీ నారప్ప.  ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: