సమంత... సౌతిండియా సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి తను అంటే ఏమిటో నిరూపించుకున్న హీరోయిన్. సమంత కేవలం హీరోయిన్ గానే మాత్రమే కాకుండా సమాజ సేవలో కూడా ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాకపోతే ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రెటీలు కేవలం డబ్బు సంపాదించడానికి కాకుండా సమాజ సేవ కూడా కొంత సమయం వారి డబ్బును కేటాయిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 


మరికొందరైతే కొన్ని ఊర్లని దత్తత తీసుకొని నిరుపేదలకు అండగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం ఇలా ఎన్నో మంచి పనులను చేస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక సమంత విషయానికి వస్తే... తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా ఉంది. తెలుగులో ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో తన భర్త నాగచైతన్య తో నటించడం గమనార్హం.

 


అయితే వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరి వివాహం జరిగింది. కాకపోతే పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో నటించాలని అందరూ భావించారు కానీ ఈ సొట్టబుగ్గల సుందరి వివాహం తర్వాత కూడా రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్, ఓ బేబీ ఇలాంటి సినిమాల్లో నటించి తన సత్తాను చాటింది. అంతేకాకుండా సమంత ఎప్పుడో మంచి మనసున్న వ్యక్తిగా తనేంటో నిరూపించుకునే సంగతి అందరికీ తెలిసినదే. ప్రత్యూష ఫౌండేషన్ పేరునా ఓ స్వచ్ఛంద సంస్థను ఆవిడ నడుపుతోంది. సమంత దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరిలాగానే సంపాదన మీదే దృష్టి పెట్టింది కానీ తన తల్లి కోరిక మేరకు 2012 సంవత్సరంలో నలుగురికి సహాయపడాలని ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి సందేశాన్ని ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ముందడుగు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: