బాలీవుడ్ మచ్ అవైటెడ్ మూవీ 83 డిజిటల్ హక్కులను నెంబర్ వన్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ కూడా పోటీ పడినా చివరికి నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి డీల్ ఓకే చేసుకుంది. కేవలం ఒక హిందీ వెర్షన్ కు మాత్రమే కాకుండా తెలుగు ,తమిళ వెర్షన్ల హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక నిజానికి ఏప్రిల్ లో విడుదలకావల్సిన ఈ సినిమా కు కరోనా షాక్ ఇచ్చింది. ఈ మహహ్మరి వల్ల సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే 83 డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదలకానుందని గత కొద్దీ రోజుల నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎంత ఆలస్యమైనా సరే 83మొదట థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పారని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా  వెల్లడించాడు. 
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా  కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తన్నాడు. అలాగే కపిల్ దేవ్ సతీమణి రోమి దేవ్ పాత్రలో రణ్వీర్ భార్య , స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ , విబ్రి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగులో ఈసినిమా ను నాగార్జున విడుదలచేయనుండగా తమిళ్ లో కమల్ హాసన్ విడుదలచేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: