ఒక్కోసారి సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా అద్భుతాలు చేస్తాయి. ప్రేక్షకుల గుండెల్లో మంచి సినిమాగా నిలిచిపోతాయి. అటువంటి అద్భుతాల్లో ఒకటిగా నిలిచిపోయిన సినిమానే ఆలీ హీరోగా వచ్చిన ‘యమలీల’. బాల నటుడిగా, కమెడియన్ గా అప్పటికే పేరున్న ఆలీ హీరోగా చేసిన తొలి సినిమా ఇది. ప్రేక్షకుల మెప్పు పొంది బాక్సాఫీస్ వద్ద మాయాజాలం చేసిన ఈ సినిమాకు నేటితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1994 ఏప్రిల్ 28న విడుదలైంది.

IHG

 

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా రాజేంద్రప్రసాద్ తో కొబ్బరిబొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు.. వంటి సూపర్ హిట్లు తీశాడు. ఈసారి తీసే సినిమాకు ఏమాత్రం అంచనాలు లేని హీరో కోసం వెతికి ఆలీని హీరోని చేశాడు. ఆ సమయంలో ఇదొక ప్రయోగమనే చెప్పాలి. సోషియో ఫాంటసీ కథకు తల్లి సెంటిమెంట్ ను జోడించి కృష్ణారెడ్డి అద్భుతమే చేశాడు. యముడిగా కైకాల సత్యనారాయణ తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. తల్లిగా మంజుభార్గవి, హీరోయిన్ గా ఇంద్రజ నటించారు.

IHG's “Yamaleela”! – Cinemacinemacinema

 

బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఎస్వీ కృష్ణారెడ్డే స్వయంగా స్వరపరచిన పాటలన్నీ చార్ట్ బస్టర్సే. ‘సిరులొలికించే చిన్ని నవ్వులే’ పాట తల్లి సెంటిమెంట్ కు ప్రతీకగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత ఆలీ హీరోగా బిజీ అయిపోయాడు. మనీషా ఫిలిమ్స్ బ్యానర్ పై కిశోర్ రాఠీ, అచ్చిరెడ్డి నిర్మాతలుగా వచ్చిన ఈ సినిమా 200 రోజులు ఆడింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసారు. వెంకటేశ్ హీరోగా తకదీర్ వాలా పేరుతో హిందీలో రీమేక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: