సూర్య... తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరంలేని తమిళ నటుడు. తాను నటించే ప్రతీ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గజిని, సెవెంత్ సెన్స్, యముడు, సింగం, సింగం2, బ్రదర్స్, 24 మొదలైన సినిమాల ద్వారా తెలుగులో కూడా సూర్య మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. సూర్య ప్రస్తుతం ‘సూరరై పొట్రు’ అంటూ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' అనే పేరుతో రానుంది. ఈ సినిమాని తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇదే కాకుండా తనకి బాగా కలిసొచ్చిన 'సింగం' సిరీస్ కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడట సూర్య.. దీనికి ముందుగా వచ్చిన మూడు సింగం సిరీస్ లకు డైరెక్షన్ చేసిన హరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. అయితే సూర్య ఇంకొన్ని కొత్త చిత్రాలకు కమిట్ అవుతున్నారట. వాటిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ చిత్రం కూడా ఉండే అవకాశం ఉంది.

 

ఇదివరకే గౌతమ్ మీనన్ - సూర్యల కాంబో గురించి వార్తలు వచ్చినా ఎక్కడా కన్ఫర్మేషన్ అందలేదు. దీంతో అందరూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు. కానీ లాక్ డౌన్ పూర్తయ్యాక గౌతమ్ మీనన్ సూర్యకు ఓ కథ వినిపించనున్నారట.  తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ రాసుకున్న కథ సస్పెన్స్ థ్రిల్లర్ అని.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీలో ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయని తమిళ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ గౌతమ్ మీనన్ డైరెక్షన్ అంటే ఏంతో ఇష్టపడే సూర్య తప్పకుండా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక గౌతమ్ మీనన్ గతంలో సూర్యతో కలిసి ‘కాఖ కాఖ', సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలు చేశారు. అందుకే వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది. మరి ఈ సినిమా పట్టాలెక్కి వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: