దర్శకుడు హరీష్ శంకర్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయాడు హ‌రీష్ శంక‌ర్‌. రవితేజ హీరోగా `షాక్` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన హ‌రీష్ శంక‌ర్.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌ర్చుకున్నాడు. ఇక హరీష్ సైలెంట్ గా తన సినిమాలు తాను తీసుకునే రకం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.  తెలుగు ఇండస్ట్రీలోని దర్శకుల్లో హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. తన దృష్టికి వచ్చిన ఎలాంటి అంశం గురించి అయినా హరీష్ సోషల్ మీడియాలో స్పందిస్తాడు. 

 

ఇక ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. క‌రోనా పేరు చెబితేనే ప్ర‌జ‌లు ఆమ‌డ‌‌దూరం పారిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ చాలా త‌క్కువ టైమ్‌లోనే దేశ‌దేశాలు వ్యాప్తి చెంది.. అటు ప్ర‌జ‌లకు, ఇటు ప్ర‌భుత్వాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అలాగే ప‌లు దేశాలు లాక్‌డౌన్ కూడా విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి. 

 

అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో త‌ప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఆస‌క్తికర పోస్ట్ పెట్టారు. `కరోనా కథలు వింటే.. ఇంట్లోనే ఉంటున్నాం అన్న దిగులు పోయి.. ఉండడానికి ఇల్లు ఉంది కదా అనే భరోసా వస్తుంది. కాబ‌ట్టి.. ఇంట్లోనే ఉండండి.. ఇంట్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటారంటూ హ‌రీష్ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. క‌రెక్ట్‌గా చెప్పార‌ని కొంద‌రు అంటుంటే.. మరి ఆ ఇళ్లుకూడా లేని వాల్ల పరిస్థితి ఏంటి సార్‌.. వాళ్లనుకూడా ప్రభుత్వాలు ఏదోఒక విధంగా ఆదుకుంటే ఇంకా బావుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: