టాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తో సినిమా చేయడానికి గానూ ఎందరో హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 8 న ఈ సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయినా సరే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పనులు పూర్తి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. 

 

ఈ సినిమాలో కొంత భాగాన్ని ఇంకా షూట్ చెయ్యాల్సి ఉంది. దీనితో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు బాలీవుడ్ హీరోలు రాజమౌళి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. తాము మీతో సినిమా చెయ్యాలి అనుకుంటున్నాం అని అక్కడి అగ్ర నిర్మాతలు ఆయనకు ఫోన్ చేసారట. మహేష్ తో సినిమాను ఓకే చేసాడు ఆయన. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టంగా తెలియదు కాబట్టి... తమకు ఒక కథ రెడీ చెయ్యాలి అని వాళ్ళు కోరినట్టు సమాచారం.

 

దీనికి ఇప్పుడు రాజమౌళి నుంచి ఏ స్పందన రాలేదు అని అంటున్నారు. ఆయన ముందు చెయ్యాలి అనుకున్నారు బాలీవుడ్ లో. అక్కడికి వెళ్తే తాను ఇక్కడి సినిమాలను కోల్పోయే అవకాశం ఉందని వెనక్కు తగ్గారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయనను సినిమా చేయించాలి అని అగ్ర నిర్మాతలు బాలీవుడ్ నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆయన మాత్రం ఏ స్పందనా చెప్పడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ లో సినిమా చేస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. అక్కడ భారీ ఆఫర్లు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: