దేశంలో ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంది. దాంతో ఉన్నవారి పరిస్థితి పక్కనబెడితే పేదవారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.  అయితే బీదవారిని ఆదుకునేందుకు ఎంతో మంది సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు  ముందుకు వస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ మూలంగా అన్నీ బంద్ కావడంతో పేద  జనాలకు ఉపాధి కరవయింది. అనేక బస్తీల్లో వేల మంది అసంఘటిత కార్మికులు కూలీలకు చేద్దామంటే పనిలేదు. తిందామంటే తిండీ లేదు.. ఎవరైనా సాయం చేస్తే బతికే పరిస్థితిలో ఉన్నారు.  

 

ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు రంగంలోకి  దిగి ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.  ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి అద్వాన్నంగా ఉంది.  ఎన్నో స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నారు..తమకు తోచినంత బీదవారికి సహాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా మహామ్మారిపై సినీ నటులు తమ వంతుగా అవగాహాన కల్పిస్తున్నారు. మరికొందరు తమకు తోచిన సహయం అందిస్తున్నారు ప్ర‌స్తుత కరోనా సంక్షోభ సమయంలో నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత.  

 

సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి. స‌జ్జ‌నార్ బృందం స‌హ‌కారంతో ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ 82,360 మందికి అన్న‌దానం చేశారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్ల‌డి చేశారు.   ఇప్పుడు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సర్‌ సూచన మేరకు నిత్యావసరాలను అందించే పని ప్రారంభిస్తున్నాం 'అని స్మిత తెలిపారు.  ఇలా పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించాలని అందరూ కోరుతున్నారు.  ప్రతి ఒక్కరికీ  కష్టకాలం వచ్చిందని.. ఇలాంటి సమయంలోనే మానవత్వం చాటుకోవాలని ఆమె అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: