‘నటీనటులకు భాషతో సంబంధం లేదు.. సినిమాలే ముఖ్యం.. సినిమా ఎక్కడైనా సినిమానే..’ ఇలాంటి మాటలు అనేక నటీనటుల నుంచి వింటూనే ఉంటాం. దీన్ని నిజం చేస్తూ అనేక మంది తమిళ నటులు తెలుగులో నటిస్తున్నారు. వారిలో హీరో సిద్ధార్ధ్ కూడా ఉన్నాడు. దాదాపు పుష్కరకాలం క్రితం వరకూ తెలుగులో ఓ వెలుగు వెలిగాడు. హీరోగా వరుస హిట్లు ఇచ్చాడు. తర్వాత కొన్ని ఫ్లాపులు రావడంతో తెలుగులో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

 

 

ఆర్ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం తన రెండో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు మహాసముద్రం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ కన్ఫర్మ్ అయ్యాడు. హీరోయిన్ గా సాయి పల్లవి పేరు దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోకు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్రకు సిద్ధార్ద్ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై సిద్ధార్ద్ తో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. సిద్ధార్ద్ కూడా ఆసక్తిగా ఉన్నాడని.. తెలుగులో అవకాశం కోసం చూస్తున్న సిద్ధార్ధ్ ఈ సినిమా చేయోచ్చనే అంటున్నారు.   

 

 

మహాసముద్రం సినిమాలో అవకాశం వచ్చిందనే వార్త ప్రస్తుతం రౌండ్ అవుతోంది. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ టీమ్ నుంచి రావాల్సిందే. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకరసినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో నువ్వొస్తానంటే ననొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు సిద్దార్ధ్. తర్వాత ఆట, ఓయ్, సంథింగ్ సంథింగ్, ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు వంటి ఫ్లాపులతో రేసులో పూర్తిగా వెనుకబడిపోయాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: