త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనుకునే హీరోలు మన తెలుగులో చాలా మందే ఉన్నారు. త్రివిక్రమ్ తో సినిమా చేస్తే అది విజయం సాధిస్తే కమర్షియల్ గా గుర్తింపు వస్తుంది హీరోలకు. అందుకే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న హీరోలు కూడా ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయన తో సినిమా చేస్తే చాలు అనే భావన లో ఉన్నారు. 

 

ఇప్పుడు ప్రభాస్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా ఫలించడం లేదు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి ఒక మంచి గుర్తింపు ఉంది. కమర్షియల్ హీరో గా మంచి గుర్తింపు సంపాదించిన ప్రభాస్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మంచి వసూళ్లు సాధించవచ్చు అనే భావన లో ఉన్నాడట. టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ తనకు బాగా ఉపయోగ పడే అవకాశం ఉందని ప్రభాస్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో  చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నాగ్ అశ్విన్ తో అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తో పాటుగానే ఈ సినిమాను కూడా చెయ్యాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తీసుకుని రావాలని పాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: