కరోనా ఉదృతం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినిమా షూటింగులు ఆగిపోయాయి. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న సమయంలోనే హాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అవ్వల్సినా సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఉధృతంగా రోజు రోజుకి మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లు వ్యాపారం చేసేవాళ్లు తెగ భయపడిపోతున్నారు. ముఖ్యంగా వైరస్ గుంపులు గుంపులుగా ఉండేచోట చాలా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల ఒక లిస్టు విడుదల చేసింది. ఆ లిస్టులో సినిమా హాల్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

 

ప్రస్తుతం దేశంలో వైరస్ ప్రభావం ఉన్న కొద్ది బలపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగిస్తూ ఏదో విధంగా కరోనా వైరస్ ని కట్టడి చేయటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇటువంటి టైమ్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలను డిజిటల్ రిలీజ్ చేయాలని చాలామంది స్టార్ హీరోలు భావిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినిమా థియేటర్ల యజమానులు టాలీవుడ్ సినిమా నిర్మాణ మండలి పై పోరాటానికి దిగుతున్నారు. భవిష్యత్తులో డిజిటల్ విధానం  ద్వారా కాకుండా కేవలం సినిమా థియేటర్లు ద్వారా మాత్రమే  రిలీజ్ చెయ్యాలని దానికి మాట ఇవ్వాలని థియేటర్ల యాజమాన్యం కోరుతుంది.

 

ఎట్టిపరిస్థితుల్లోను డిజిటల్ విధానం సినిమాలు రిలీజ్ చేయకూడదని కోరుకుంటుంది. మరి సినీ నిర్మాణ మండలి ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోపక్క సూర్య డిజిటల్ విధానం ద్వారా సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో తమిళనాడులో ఉన్న సినిమా థియేటర్ల యాజమాన్యాలు భవిష్యత్తులో సూర్య సినిమాలు ఏవీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లో రిలీజ్ అవ్వవు.. అంటూ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు సౌత్ లో కూడా కరోనా దెబ్బ ఓ రేంజ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: