మన తెలుగు ఇండస్ట్రీ క్లాసిక్ కాంబినేషన్స్ లో వెంకటేష్ - సౌందర్య జంట కూడా ఒక మంచి గుర్తింపు లభించిన జంట అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ పోలీస్, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం రా..., రాజా, దేవిపుత్రుడు, జయం మనదేరా, పెద్ద రాయుడు ఇలా మంచి హిట్ సాధించుకున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక " సూపర్ పోలీస్ " సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సినిమా అవ్వడం విశేషం. 

 

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో పవిత్ర బంధం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. అలాగే తెలుగు మహిళ ఆదరణ కూడా బాగా సాధించిందని చెప్పాలి. ఇందులో ఒక భార్య తన భర్త కోసం ఏ విధమైన ప్రేమ, ఆదరణ చూపిస్తుందో అని తెలుపడానికి చాలా బాగా ఈ సినిమా రూపొందించడం జరిగింది. అలాగే ఈ సినిమా సకుటుంబ సపరివారంగా చూడదగ్గ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది అనే చెప్పాలి. 

 


ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో " ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు " సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఒక కుటుంబం కథ చిత్రంగానే ప్రేక్షకులలో నిలిచిపోయిందని చెప్పాలి. నిజానికి ఇప్పటికి సినిమా టీవీలలో వస్తుంటే చాలామంది చూస్తుంటారు. అది ఆ సినిమాలో ఉండే కంటెంట్. ఏది ఏమైనా కానీ వీరిద్దరి కాంబినేషన్లో మంచి హిట్లు సొంతం చేసుకున్నారని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక హిట్ పెయిర్ కూడా అనేవాళ్ళు అప్పట్లో. అలాగే వీరిద్దరూ కలిసి చివరగా చేసిన సినిమా " దేవిపుత్రుడు ". సౌందర్య, వెంకటేష్ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ తో సౌందర్య కి ఎనలేని అనుబంధం ఉండడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: