చిరంజీవి కెరీర్ జెట్ స్పీడ్ గా దూసుకుపోతున్న సమయంలో తన ఫ్రెండ్స్.. నారాయణ రావు, సుధాకర్, హరి ప్రసాద్ నిర్మాతలుగా ఓ సినిమా చేశారు. డైనమిక్ మూవీ మేకర్స్ అని చిరంజీవే బ్యానర్ పేరు పెట్టి చేసిన ఆ సినిమానే ‘యముడికి మొగుడు’. ఆ సినిమా సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. 5కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. నేటితో ఆ సినిమా విడుదలై 32 ఏళ్లు పూర్తయ్యాయి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1988 ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది.

IHG

 

1987 నుంచి 1992 వరకూ ప్రతి ఏడాది చిరంజీవి ఇచ్చిన ఇండస్ట్రీ హిట్ల వరుసలో ఇది రెండో సినిమా. కాళీగా రఫ్, బాలుగా అమాయకమైన పాత్రలను చిరంజీవి అద్భుతంగా పోషించాడు. చిరంజీవి నటన, డ్యాన్సులు, ఫైట్లు, కథ.. అన్నీ కలిసి చిరంజీవి అభిమానులతో పాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. ‘అందం హిందూళం’ అనే పాటలో చిరంజీవి డ్యాన్స్ కు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. యముడిగా కైకాల సత్యనారాయణ ఆ పాత్రకు ప్రాణం పోశారు. చిరంజీవి-సత్యనారాయణ మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు.

IHG

 

చిరంజీవి సినిమాకు రాజ్-కోటి తొలిసారి అందించిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్లే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా 13 సెంటర్లలో 100 రోజులు.. మొత్తంగా 175 రోజులు రన్ అయి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. చెన్నైలో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముగ్గురు స్నేహితులు కలిసి సినిమా తీయాలనేది చిరంజీవి ఆలోచనేనని నారాయణ రావు ఓ సందర్భంలో అన్నారు. ఈ బ్యానర్ లో మరో సినిమా తీయకపోవడంతో వన్ మూవీ వండర్ గా ఈ సినిమా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: