చిరంజీవి కెరీర్లో ఎన్నో సినిమాలు పలువురు హీరోయిన్ల కాంబినేషన్లలో రిపీట్ అయ్యాయి. వారిలో విజయశాంతి, రాధ, రాధిక తర్వాత చిరంజీవికి లక్కీ హీరోయిన్ గా రంభ అనే చెప్పాలి. చిరంజీవి మెగాస్టార్ గా కీర్తి శిఖరాలు అధిరోహించిన తర్వాత రంభ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

IHG

 

చిరంజీవిరంభ జంటగా వచ్చిన తొలి సినిమా అల్లుడా మజాకా. ఈ సినిమాలో రమ్యకృష్ణతో కలిసి చేసిన రంభ చిరంజీవికి సరి జోడి అనిపించుకుంది. తన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత హిట్లర్ లో నటించింది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కూడా హిట్టైంది. ఈ సినిమాలోని ‘అబిబీ.. అబీబీ’ అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో మూడోసారి జత కట్టింది. బావగారూ.. బాగున్నారా సినిమాలో నటించింది. గ్లామర్ పాత్రకు కేరాఫ్ అడ్రెస్ అయిన రంభ ఈ సినిమాలో ఆ పేరుకు తగ్గట్టే నటించింది. సెకండాఫ్ లో వచ్చే ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా’ అనే పాటలో చిరంజీవితో పోటీ పడి డ్యాన్సులు వేసి మెప్పించింది.

IHG

 

బావగారూ.. బాగున్నారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో హీరోయిన్ గా రంభ మరే సినిమా చేయలేదు. కానీ.. మృగరాజు, ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవితో స్పెషల్ సాంగ్స్ చేసింది రంభ. సినిమా బిజినెస్, క్రేజ్, హిట్, ఫ్లాప్ లకు హీరో హీరోయిన్ల జంట కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో చిరంజీవికి రాధిక, విజయశాంతి, రాధ తర్వాత రంభ హిట్ పెయిర్ గా నిలిచింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: