టాలీవుడ్ నటుడు నటసింహం బాలయ్య నటించిన సింహా సినిమా 2010వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి అంతకముందు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న బాలయ్యకు, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సూపర్ డూపర్ హిట్ ని అందించడంతో పాటు అత్యధిక కలెక్షన్ సాధించి ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా చేసింది. నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రెండు రకాల విభిన్న పాత్రల్లో నందమూరి బాలకృష్ణ నటన అత్యద్భుతం అనే చెప్పాలి. సంగీత దర్శకుడు చక్రి అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అప్పట్లో థియేటర్స్ లో అభిమానులతో విపరీతంగా విజిల్స్ వేయించింది. 

IHG

వాస్తవానికి ఈ సినిమా మూల కథ పాతదే అయినప్పటికీ కూడా దానిని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి అద్భుత ప్రతిభ ఈ సినిమాలో ని ప్రతి ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. యూనైటడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి తెరకెక్కించిన ఈ సినిమాకు ఆర్థర్ ఏ విల్సన్ అందించిన ఫోటోగ్రఫి మరొక అసెట్ అనే చెప్పాలి. కొన్ని కీలక యాక్షన్, ఫైట్ సీన్స్ లో బాలకృష్ణ పెర్ఫార్మన్స్ తో పాటు ఆయన పలికిన డైలాగ్స్, అలానే హీరోయిన్స్ నయనతార, స్నేహ ఉల్లాల్ ల అందం అభినయంతో పాటు ప్రత్యేక పాత్రలో నటించిన ముద్దుగుమ్మ నమిత నటన కూడా ఈ సినిమాకు ఎంతో బాగా కలిసి వచ్చింది. 

 

విలన్ గా ప్రముఖ మలయాళ నటుడు సాయి కుమార్ ఈ సినిమాలో అదిరిపోయే నటనను కనబరిచారు. మొత్తంగా ఈ అంశాలు అన్ని కూడా సింహా సినిమా మంచి హిట్ సాధించడానికి కలిసొచ్చాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా రేపటితో సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోబోతుండడంతో పలువురు నందమూరి ఫ్యాన్స్ సినిమా యూనిట్ కి, అలానే తమ హీరో బాలయ్యకు ప్రత్యేకంగా అబినందనలు తెల్పడంతో పాటు దీనిని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ గా క్రియేట్ చేసి వైరల్ చేసేందుకు ఇప్పటినుండే సిద్ధం అయ్యారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: