ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో శ్రీరెడ్డి పేరు తెలియని తెలుగు వారు దాదాపుగా ఉండరు అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకి కొత్తగా అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను కొందరు మేనేజర్లు మాయ మాటలు చెప్పి మోసగించి లొంగదీసుకుంటారని, ఇంకొందరు అయితే వారికి అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి లైంగికంగా వారిని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై మా అసోసియేసన్ వారు సరిగ్గా స్పందించకపోవడంతో మా అసోసియేషన్ ఆఫీస్ ముందు ఏకంగా అర్ధ నగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి పేరు అప్పట్లో తెగ మారుమ్రోగింది. 

 

అయితే ఆమె అమ్మాయిలకు న్యాయం జరిగేలా చేస్తున్న పోరాటానికి మేము కూడా మద్దతు పలుకుతాం అని అప్పట్లో కొందరు ముందుకు రావడం జరిగింది. కాగా ఆ తరువాత ఆమె ఒక సందర్భంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు తనను లైంగికంగా వాడుకుని అవకాశాలు ఇప్పిస్తాం అని మోసం చేసారని కొందరి పేర్లు బయటపెట్టడంతో పాటు, ఏకంగా ఒక ప్రముఖ నిర్మాత తనయుడితో దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అప్పట్లో పెను సంచలనం రేపిన ఆ ఫోటో మరియు శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొంత దుమారాన్ని కూడా రేపాయి. 

 

ఇక ఆ తరువాత ఒక సందర్భంలో నటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నై కి తన మకాం ని మార్చింది. ఇటీవల కొన్నాళ్లుగా కూడా కొందరు నటులు, రాజకీయ నాయకులపై పలు విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి, గత కొద్దిరోజులుగా తన పంథాని కొంత మార్చి ఎక్కువగా లేటెస్ట్ ట్రెండ్ అయిన టిక్ టాక్ వీడియోస్ చేయడం మొదలెట్టింది. ప్రతి రోజు కూడా తన స్టైల్ లో కొన్ని టిక్ టాక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్న శ్రీరెడ్డి పై పలువురు నెటిజన్లు, ఓహో ఈ సారి నీ పైత్యం ఇటువైపు తిరిగిందన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: