సమంత రూత్‌ప్రభు ..ఇప్పుడు అక్కినేని సమంత. పెళ్ళికి ముందు విపరీతమైన గ్లామర్ షో చేసిన సమంత నాగ చైతన్యని పెళ్ళి చేసుకున్నాక మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకటి అరా సీన్స్ లో కూడా గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడం లేదు. అందుకే మజిలీ సినిమాలో చాలా కేర్ తీసుకుంది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన ఓ బేబి, జాను సినిమాలలోను తన పాత్ర ఏమాత్రం గ్లామర్ గా లేకుండా మేకర్స్ కి ముందుగానే సూచించింది. ఇక మజిలీ సక్సస్ తో మళ్ళీ మళ్ళీ అలాంటి కథలుంటే చెప్పమని ఇద్దరం కలిసి నటిస్తామని దర్శక, నిర్మాతలకి సూటిగానే తెలిపారు.

 

ఇక ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. లవ్ స్టోరీ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి బజ్ క్రియోట్ అయింది. ఖచ్చితంగా ఫిదా వంటి సక్సస్ కొట్టబోతున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నాగార్జున తో కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది.

 

ఇదిలా ఉంటే రీసెంట్ గా సమంత చేసిన జాను భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకొని హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న సమంత ఫ్లాన్ ఊహించని రీతిలో తిరగబడిపోయాయి. అయితే ప్రస్తుతం సమంత ఎక్కువగా వెబ్ సిరీస్ మీద ఆకస్తి చూపిస్తుంది. అందులో భాగంగానే ఫ్యామిలీ మాన్ 2 లో ఒక నెగిటివ్ రోల్ చేసింది.

 

ఈ పాత్ర ఇప్పటి వరకు సమంత చేయనిది కాకపోవడంతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. అంతేకాదు ఇక మీదట కూడా ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్దంగా ఉన్నానని మేకర్స్ కి తెలిపింది. అయితే వెబ్ సిరీస్ లో మాత్రం చైతూ తో కలిసి నటించాలన్న ప్రతిపాదన మాత్రం తేవడం లేదట. మరి ఎందుకో ఇలా అని కొందరు అడుగుతున్నారట.
     

 

మరింత సమాచారం తెలుసుకోండి: