ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు, సంచలనాలకు మారుపేరైన సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సారిగా రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనయుడైన మహేష్ బాబు, చిన్నప్పుడే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇక హీరోగా వచ్చిన రాజకుమారుడు నుండి హీరోగా ప్రారంభమైన మహేష్ నట ప్రస్థానం, అక్కడి నుండి మధ్యలో కొన్ని హిట్స్, అలానే ఫ్లాప్స్ కలగలుపుగా ముందుకు సాగింది. వాస్తవానికి ఫస్ట్ సినిమా రాజకుమారుడు తోనే సూపర్ డూపర్ హిట్ హీరోగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహేష్, ఆపై కెరీర్ లో ఎన్నో డేరింగ్ స్టెప్స్ వేయడం జరిగింది. 

IHG

ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన మహేష్, మధ్యలో అక్కడక్కడా ఒకటి, రెండు కమర్షియల్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక ఇటీవల వరుసగా కొంత సందేశాత్మక సినిమాల్లో నటించిన సూపర్ స్టార్, మొన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన పంథాని పూర్తి గా మార్చి మళ్ళి ఎంటర్టైన్మెంట్, కమర్సియల్ యాంగిల్ కి వచ్చారు. ఇక అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న మహేష్ కెరీర్ లో అక్కడక్కడా యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సాదించిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమా గొప్పగా అత్యద్భుత విజయాన్ని అందుకోనప్పటికీ, మంచి హిట్ అయితే సాధించింది. వాస్తవానికి ఆ సినిమా సెకండ్ హాఫ్ ని కొద్దిగా మార్చి దర్శకుడు అనిల్ తెరకెక్కించి ఉంటే, సంక్రాంతి సీజన్ లో సోలో హిట్ గా సరిలేరు మరింత గొప్ప విజయాన్ని అందుకునే ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

IHG

ఇక మహేష్ సినిమా అంటే చాలు తొమ్మిదేళ్ల బాలుడి దగ్గరి నుండి తొంబై ఏళ్ళ వృద్ధుడి వరకు కూడా అందరూ సినిమాని చూడాలనే ఆసక్తిని కలిగి ఉంటారని, ఆ విధంగా తన కెరీర్ ని ఎంతో గొప్పగా డిజైన్ చేసుకుని, ప్రేక్షకుల, అభిమానుల మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించిన మహేష్ పేరు ఒక్కరి చాలు బాక్సాఫీస్ గత రికార్డులన్నీ ఎప్పటికపుడు గంగ పాలే అని వారు అంటున్నారు. ఇక ఇప్పటివరకు కొంత మెసేజ్ ఓరియెంటెడ్, అలానే కమర్షియల్ యాంగిల్ ఉన్న సినిమాలే చేసిన మహేష్, ఒక పక్కా ఊర మాస్ సినిమా కనుక చేస్తే చాలు, ఆ సినిమా కొట్టే రికార్డ్స్ కొన్నేళ్ల పాటు మరొకరు టచ్ చేయడం కుదరదని, అటువంటి సినిమాని మా హీరో ఎప్పుడు చేస్తారో చూడాలని చాలా రోజులుగా మహేష్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా వారి కోరికని మహేష్ తీరుస్తారో లేదో చూడాలి...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: