టాలీవుడ్ సూపర్ హిట్ పెయిర్ లలో నాగార్జున, టబుల జోడీ గురించి మాట్లాడాల్సిందే. కూలీ నంబర్ 1 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా టబు ఆ తర్వాత నాగార్జునతో వరుస సినిమాలు చేసింది. సిసింద్రి, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో నాగార్జున, టబు కలిసి నటించారు. ఇద్దరు కలిసి నటించిన సినిమాలు హిట్ అవడం.. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడటం జరిగింది. నాగార్జునతో తప్ప టబు మారే హీరోతో చేయదు అన్న టాక్ కూడా అప్పట్లో వచ్చింది. 

 

అంతేకాదు నాగార్జున, టబుల మీద రకరకాల రూమర్స్ వచ్చాయి. అందులో క్రేజీ రూమర్ ఏంటంటే నాగార్జున టబుని పెళ్లాడుతాడు అన్న వార్తే.. కొన్నాళ్లు ఈ న్యూస్ అలా వైరల్ గా మారింది. అయితే ఎప్పుడైతే తెలుగు పరిశ్రమ నుండి టబు బాలీవుడ్ కు వెళ్లిందో అప్పుడు ఇలాంటి న్యూస్ లకు బేక్ పడ్డది. ఇప్పటికి టబు పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా సిల్వర్ స్క్రీన్ పై మాత్రం నాగార్జున, టబు కనిపిస్తే ఆడియెన్స్ విజిల్స్  వేస్తారు. నాగార్జున మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలో టబు నటించింది. 

 

అంతేకాదు నిన్నే పెళ్ళాడతా లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ కూడా వీరి కాంబినేషన్ లో వచ్చింది. రొమాన్స్ లో నాగార్జున తర్వాతే ఎవరైనా అనిపించేలా టబు తో కూడా కింగ్ నాగార్జున అదరగొట్టారు. ప్రస్తుతం హింది సినిమాలే చేస్తూ అక్కడే సెటిల్ అయినా టబు మళ్ళీ తెలుగులో నాగార్జునతో నటిస్తే చూడాలని కోరుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. అప్పటికి ఇప్పటికి ఈ జోడీ అంటే ఆ క్రేజ్ వేరే అని చెప్పొచ్చు. నాగార్జున అడగాలే కానీ ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు టబు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ మధ్య అంత మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: