కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ నుండి కూడా అందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కుంటున్న స‌మ‌యంలో తనకి తోచిన విధంగా సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని సల్మాన్‌ ఖాన్ ప్రకటించాడు. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేసారు. అందులో భాగంగా తొలి విడతలో పేద సినీ కార్మిక కుటుంబాలకి రూ.3 వేలు అందించిన స‌ల్మాన్.. రెండో నెల‌కు కూడా నిధులు విడుద‌ల చేసాడు. అంటే 25 వేల మందికి ఇప్ప‌టిదాకా ఒక్కొక్క ఫ్యామిలీకి రూ.6 వేల చొప్పున ఇచ్చాడు. ఇలా మొత్తం స‌ల్మాన్ నుంచి రూ.15 కోట్ల సాయం అందించాడు. 

 

ఇదిలా ఉండగా ఇప్పుడు మన టాలీవుడ్ లో 'బి ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ ను సల్మాన్ ఖాన్ మొదలు పెట్టి తన ఉదారతను చాటుకున్నారు. అలా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆహార కొరతతో బాధ పడుతున్న నిరుపేదలకు భారీ సహాయాన్ని అందించారు. మొత్తం 1 లక్ష 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి సల్మాన్ ఇప్పటి నుంచి ఇది కూడా ఒక ఛాలెంజే అని అందులో భాగమే ఈ 'అన్న దానం' అంటూ ట్వీట్ చేసారు. అందరూ ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయమని కోరాడు. అలానే సల్మాన్ అక్కడ బీయింగ్ సల్మాన్ పేరిట ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: