ఆమని జగపతి బాబు... ప్రేక్షకులకు బాగా దగ్గరైన జంట ఇది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మూడు నాలుగే అయినా వీరు మాత్రం చాలా బాగా దగ్గరయ్యారు ప్రేక్షకులకు. ఆ స్థాయిలో వీరి కామినేషణ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. టాలీవుడ్ లో ఈ జంట సినిమాలు అనగానే వీరు ప్రేమలో ఉన్నారు కాబట్టే అలా నటిస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏ స్థాయిలో ప్రేక్షకులకు దగ్గర అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. వీరి కాంబినేషన్ కోసం చాలా మంది దర్శకులు కూడా ఎదురు చూసారు. వీళ్ళు పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని అనుకున్నారు.

 

జగపతి బాబు ఆమనీ విషయంలో పెళ్లి చేసుకోవాలని చూసినా సరే ఆమెకు అప్పటికే వివాహం అయింది కాబట్టి ఆమె విషయంలో వెనక్కు తగ్గారని టాలీవుడ్ వర్గాలు అనేవి. వీరి పెళ్లిని కొందరు ఒప్పుకోలేదు అని జగపతి బాబు తండ్రి అసలు వద్దు అని అన్నారని అంటారు. వీరి కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉండే వారు. వీరితో కనీసం పది సినిమాలు చేసే ఆలోచన కూడా కొంత మంది దర్శకులు చేసినా కొన్ని విభేదాలు ఒత్తిళ్ళ కారణం గా వెనక్కు తగ్గారు అనే ప్రచారం జరిగేది అప్పట్లో. అందుకే వీరి సినిమాలు ఎక్కువగా రాలేదు టాలీవుడ్ లో. 

 

ప్రేక్షకులు కూడా వీరి కెమిస్ట్రీ కోసం చాలా ఆశగా ఎదురు చూసిన సందర్భం కూడా ఉంది అనేది వాస్తవం. జగపతి బాబు ఆమె మీద ఉన్న ప్రేమను బయటపెట్టారని ఆమె కూడా ఆసక్తి చూపించారని అందుకే సినిమాలు ఆగిపోయాయి అని అంటూ ఉంటారు. ఆమె దూరం అయిన తర్వాత జగపతి బాబు ఒత్తిడి లోకి కూడా వెళ్ళారు అని అంటూ ఉంటారు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: