శ్రీదేవి ఎన్టీఆర్... ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు అలనాటి ప్రేక్షకులు అలా చూస్తూ ఉండే వాళ్ళు. వీరి సినిమా పోస్టర్ కనపడినా చాలు ప్రేక్షకులకు ఒక పండగ. దర్శక నిర్మాతలకు వీరి కాంబినేషన్ లో సినిమా అంటే చాలు ఒక ఊపు వస్తుంది. ఎన్టీఆర్ శ్రీదేవి నటన చూసిన ప్రేక్షకులకు ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు చిత్రంలో వీరు ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 

 

దాదాపు పది సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ప్రతీ సినిమా కూడా చరిత్ర సృష్టించింది. శ్రీదేవి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అడవి రాముడు సినిమా అయితే టాలీవుడ్ లో ఒక సంచలనం. వీరి మధ్య వచ్చిన పాట లు కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ప్రతీ పాట కూడా చరిత్రలో నిలిచిపోయింది అనేది వాస్తవం. ప్రతీ పాట లో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ ఒక స్థాయిలో ఆకట్టుకుంది. టాలీవుడ్ లో వీరు ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంటే చాలు సినిమా తీసే నిర్మాతకు ఒక పండగ అనేది వాస్తవం. 

 

భారీ లాభాలు కూడా వచ్చేవి సినిమాకు ఆ విధంగా సినిమాలు హిట్ అయ్యేవి. టాలీవుడ్ లో ఏ జోడీ కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులకు దగ్గర కాలేదు అనేది వాస్తవం. ప్రస్తుతం ఈ స్థాయిలో ఏ జోడీ కూడా టాలీవుడ్ లో ఆకట్టుకోవడం లేదు అనేది వాస్తవం.  ఎన్టీఆర్ కూడా శ్రీదేవి తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించే వారు అప్పట్లో. ఆమె కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గానూ అవసరం అయితే వేరే సినిమాలను కూడా వదులుకునే వారు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: