బాలీవుడ్ లో నేటితరం నటీనటుల మధ్య ప్రేమాయణం అనేది కామన్ గా మారిపోయింది. ఎప్పుడు లవ్ చేసుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు. బాలీవుడ్ లో ప్రేమలో పడటం.. బ్రేకప్‌ చెప్పుకోవడం.. మళ్లీ ప్రేమలో పడటం అన్నీ కామనే. అయితే అన్ని వ్యవహారాలున్నా రణ్‌ బీర్ కపూర్ మాత్రం అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తాడు. బాలీవుడ్‌‌ లో కపూర్ ఫ్యామిలీ నట వారుసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రణబీర్ కపూర్. బాలీవుడ్ ప్లేబాయ్‌ గా పేరున్న స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు. మొదట సోనమ్ కపూర్.. మొన్న దీపికా పదుకొణే.. నిన్న కత్రినా కైఫ్.. ఈరోజు ఆలియా భట్.. ఇలా రణ్‌‌ బీర్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. రణబీర్ ఓ నిత్య ప్రేమికుడని చెప్పవచ్చు. సోనమ్ కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ లకు బ్రేకప్ చెప్పేసిన రణ్‌ బీర్ ప్రస్తుతం ఆలియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. రణబీర్ తో బ్రేకప్ తర్వాత దీపికా - రణ్ వీర్‌ సింగ్‌ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయితే రణబీర్ దీపికాతో బ్రేకప్ చేసుకోడానికి ఆయన తల్లి నీతూ కపూర్ కారణమనే వార్తలు చాలా రోజులు క్రితం వచ్చాయి.

 

దీపికా చాలా ఆవేదనకు లోనైనట్లు.. తనకి జరిగిన మోసం గురించి కొంచెం కొంచెంగా స్పందిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా దీపికా మరోసారి తన బ్రేకప్ స్టోరీపై స్పందించిందట. 'శృంగారం అనేది మనసుకు సంబంధించింది.. శరీరానికి సంబంధించింది కాదు అంటూ.. ఒకసారి మోసం చేస్తే పొరపాటు అనుకోవచ్చు.. రెండవసారి కూడా అదే పని చేస్తూ దొరికిపోతే.. మనపై అతనికి ఎలాంటి ప్రేమ లేదని అర్థం చేసుకోవచ్చు' అని దీపికా ఇండైరెక్ట్ గా రణ్ బీర్ పేరు ప్రస్తావించకుండానే అతను చేసిన మోసం గురించి చెప్పిందట. ఆ తరువాత ఎన్నో రోజులు తీవ్ర మనోవేదనకు లోనయ్యానని దీపికా చెప్పిందట. దీపికా పదుకొణేకి టాటా చెప్పిన రణ్ బీర్ మాత్రం కొన్ని రోజులు కత్రినా కైఫ్ తో డేటింగ్ చేసి ఆ తరువాత యంగ్ బ్యూటీ ఆలియా భట్ ని లైన్ లో పెట్టాడు. మరి రణబీర్ ఈ ముద్దుగుమ్మతో రిలేషన్ షిప్ అయినా పెళ్ళిపీటల దాకా తీసుకొస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: