సినిమా అంటే రంగుల ప్ర‌పంచం. ఇందులో చాలా మంది న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని కాంబినేష‌న్స్ మాత్రం హిట్ పెయిర్స్ ఉంటాయి. అవి తెర మీద చూడ‌టానికి చాలా బావుంటుంది. అది ఏ రేంజ్‌లో అంటే వీరు నిజంగానే భార్య‌భ‌ర్త‌లా...లేక ప్రేమికులా అన్న రేంజ్‌లో ఉంటుంది. కొంద‌రి న‌ట‌న. వారు అంత‌టి అద్భుత‌మైన న‌ట‌న‌ను తెర‌పైన క‌న‌బ‌రుస్తారు. అలా అంద‌రికి న‌చ్చి తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చే జంట నాగార్జున సౌంద‌ర్య అని చెప్పాలి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ కూడా చాలా బావుంటుంది. వీరిద్ద‌రు క‌లిసి చాలా చిత్రాల్లోనే న‌టించారు. ఇక సౌంద‌ర్య న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సావిత్రి చ‌నిపోయాక అంత‌టి మ‌హాన‌టిలాగా న‌టించే పేరు సౌంద‌ర్య‌కి మాత్ర‌మే వ‌చ్చింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాల లిస్ట్ గురించి ఆ హిట్లు గురించి ఓసారి చూద్దాం.

 

హ‌లోబ్ర‌ద‌ర్ చిత్రంలో నాగార్జున సౌంద‌ర్య కాంబినేష‌న్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తారు. ఒక పాత్ర‌కి ర‌మ్య‌కృష్ణ హీరోయిన్‌గా ఉండ‌గా..మ‌రో పాత్ర‌కి సౌంద‌ర్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇందులో వీరిద్ద‌రి అమాయ‌క‌పు న‌ట‌న అదిరిపోద్ది. సినిమా మొత్తం ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. అప్ప‌ట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు ఫుల్ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఆ త‌ర్వాత రాముడొచ్చాడు ఈ చిత్రంలో సౌంద‌ర్య ఓ ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చే అమాయ‌క‌పు అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. సౌంద‌ర్య‌కు మొత్తం సిటీ లైఫ్‌ని అల‌వాటు చేసే పాత్ర‌లో నాగార్జున క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత ఎదురులేని మ‌నిషి చిత్రంలో తిరిగి వీరిద్ద‌రూ జ‌త క‌డ‌తారు. అందులో సౌంద‌ర్య నెగిటివ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మెప్పుపొందింది. ఇక నాగార్జున ఊరికి పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇక నిన్నేప్రేమిస్తా చిత్రంలో మ‌ళ్ళీ నాగార్జున సౌంద‌ర్య జ‌త క‌డ‌తారు. అయితే ఇందులో నాగార్జున నిడివి త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్స్ ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు బుల్లితెర మీద ఆస్వాదిస్తూనే ఉన్నారు.

 

ఇందులో వీరిద్ద‌రూ ఎంగేజ్‌మెంట్ అయి అనుకోకుండా మిల‌ట‌రీ వెళ్ళిన‌ప్పుడు నాగార్జున చ‌నిపోతాడు. ఆ త‌ర్వాత ఆ క‌ళ్ళ‌ను శ్రీ‌కాంత్‌కి పెడ‌తారు. అక్క‌డి నుంచి సౌంద‌ర్య పాత్ర ఈ చిత్రంలో అత్య‌ద్భ‌/త‌ం అని చెప్పాలి. ఈ చిత్రం సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించారు. ఆ త‌ర్వాత తిరిగి ఆజాద్ చిత్రంలో న‌టించారు. అందులో నాగార్జున దేశ‌ద్రోహుల‌ను చంపే పాత్ర‌లో క‌నిపిస్తే సౌంద‌ర్య ఓ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో అద‌ర‌గొడుతుంది. ఇలా టాలీవుడ్‌లో కొన్ని కాంబినేష‌న్స్ రిపీట్ అయిన‌ప్ప‌టికీ బోర్ ఫీల‌వ‌కుండా చూసే కాంబినేష‌న్ వీరిద్ద‌రిది కూడా ఒక జంట అని చెప్పుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: