తెలుగులో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ తక్కువ మందికి చాలా తక్కువ అవకాశాలు వస్తుంటాయి. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఎందుకు కనిపించరంటే దానికి రకరాల సమాధానాలు చెప్తారు. ఐతే వాటిల్లో ఎంత నిజం ఉందనేది దర్శకనిర్మాతలే తెలియాలి. లఘుచిత్రాల ద్వారా  పాపులర్ అయ్యి కేటుగాడు సినిమాతో వెండితెరకి పరిచయం అయిన భామ చాందినీ చౌదరి.

 

సాధారణంగానే తెలుగమ్మాయి అయిన చాందినీకి అవకాశాలు రాలేదు. అందం, అభినయం రెండూ ఉన్న కూడా అవకాశలు పెద్దగా రాలేదు. అలా అని సినిమాలు లేవని కాదు. అప్పుడప్పుడూ చిన్న సినిమాల్లొ హీరోయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద సినిమాల్లో చాలా తక్కువ నిడివి కలిగిన పాత్రలే చేసింది. అయితే సినిమాలు లేకపోయినా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆమెకి మంచి అవకాశంలా మారింది. ఈ ఫ్లాట్ ఫామ్ పై వెబ్ సిరీస్ లలో కనిపిస్తుంది. సినిమాలు లేకపోయినా వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

 


ఆమె నటించిన క్రౌడ్ ఫండెడ్ మూవీ మను చిత్రంలోని ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ లో లీడ్ రోల్ పోషించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ప్రతీ హీరోయిన్ తనకి ఇష్టమైన పాత్రల్లో చేయాలని ఉంటుంది. ఇష్టమైన నటుడితోనో, ఫేవరేట్ డైరెక్టర్ దర్శకత్వంలోనో సినిమాలు చేయాలని ఉంటుంది. తమ కెరీర్లో ఒక్కసారైనా ఆ కోరికని నెరవేర్చుకోవాలని అనుకుంటారు. 

 

చాందినీ చౌదరికి కూడా అలాంటి కోరికే ఉందట. తెలుగులో తన ఫేవరేట్ యాక్టర్ గురించి చెబుతూ ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలని ఉందని చెబుతుంది. ఇంతకీ ఆమె ఫేవరేట్ యాక్టర్ ఎవరా అని అనుకుంటున్నారా.. అతడే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరేట్ యాక్టర్ అట. ఆయనలా నటించడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతుంది. ఎప్పటికైనా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేస్తానని చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: