గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల పరిధి పెరిగింది. మన సినిమాలకి అంతటా గిరాకీ పెరిగింది. తెలుగు సినిమాలు చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. అందుకే తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఫార్ములా బేస్డ్ సినిమాలతో వచ్చేవారు. అయొతే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమాలని రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

 

అయితే లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో కాలక్షేపం కోసం సినిమాలని చూస్తున్నారు. ఆ భాషా, ఈ భాషా అని తేడా లేకుండా ప్రపంచ బాషల్లో తమకి నచ్చిన సినిమాలని చూసేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు క్రికెటర్లు తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఇండియన్ బౌలర్ అశ్విన్, హైదరనాదీ క్రికెటర్ హనుమ విహారీతో వీడియో కాల్ మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి డిస్కస్ చేశాడు.

 


ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి తెలుగు సినిమా చెప్పమని విహారిని అడగ్గా, విహారి దానికి సమాధానమిస్తూ, నితిన్ నటించిన భీష్మ చిత్రం చాలా బాగుందని, సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకోవచ్చని తెలిపాడు. దానికి అశ్విన్ నేను తెలుగు సినిమాలు బాగా చూస్తున్నానని, ఈ లాక్డౌన్ టైమ్ లో తెలుగు సినిమాలకి అభిమానిగా మారిపోయానని తెలిపాడు. అమెజాన్ లో వచ్చే ప్రతీ తెలుగు సినిమాని చూస్తున్నానని చెప్పాడు.

 

 

మీ ఫేవరేట్ మూవీ ఏదీ అని విహారి అడగ్గా, రామ్ చరణ్ నటించిన మగధీర్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ అని అశ్విన్ సమాధానం ఇచ్చాడు. అలాగే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఎవరు సినిమా చాలా బాగుందని, మహేష్ బాబు సినిమాల కి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: