టాలీవుడ్ లో చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసే వారు. వీరి కాంబినేషన్ లో 14 సినిమాలు రాగా 12 సినిమాల్లో చిరంజీవి ప్రధాన హీరో గా ఉన్నారు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే టాలీవుడ్ లో ఒక సంచలనం. ఈ సినిమా శ్రీదేవి కెరీర్ లో మంచి సినిమా అని చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనం. ఆ సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో ఈ స్థాయిలో మరో కాంబినేషన్ మాస్ ప్రేక్షకులకు దగ్గర కాలేదు. 12 సినిమాల్లో కూడా చిరంజీవి స్థాయిని పెంచుతూ పోయారు ఆయన. ప్రతీ సినిమా కథ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనేది వాస్తవం. ఎన్ని సినిమాలు చేసినా సరే రాఘవేంద్ర రావు కి చిరంజీవి బెస్ట్ హీరో అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు. ఆయన కూడా చిరంజీవి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే వారు అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఈ కాంబినేషన్ హిట్ అయింది. ప్రతీ సినిమా కూడా మంచి వసూళ్లు సాధించింది.

 

వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాల కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే నిర్మాతలు కూడా పెట్టుబడి ఎంత అయినా పెట్టడానికి ముందుకు వచ్చే వారు. ఆ స్థాయిలో ఈ జోడి హిట్ అయింది. మన తెలుగులో దర్శకులు ఎవరూ కూడా ఆ స్థాయిని అందుకోలేక పోయారు అనేది వాస్తవం. మొన్నీ మధ్య వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: