తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు ఉన్నా వెంకటేష్ కి మాత్రం ఒక ప్రత్యేకత లక్రేజ్ ఉంటుంది.  ఎందుకంటే ఫ్యామిలీ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు హీరో వెంకటేష్. కెరీర్ మొదటి నుంచి ఓవైపు యాక్షన్ చిత్రాలు చేసి అభిమానులను అలరించడం తో పాటు మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలను ఎక్కువగా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి  దగ్గరయిపోయారు విక్టరీ వెంకటేష్. అయితే విక్టరీ వెంకటేష్ ఇప్పుడు వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంత మంది హీరోయిన్లతో నటించినప్పటికీ విక్టరీ వెంకటేష్ తో  బెస్ట్ జోడి అనిపించుకున్న హీరోయిన్ మాత్రం మీనా  అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రికార్డులు సృష్టించాయి. 

 

 

 ఫ్యామిలీ ఆడియన్స్ కు  వెంకటేష్ ను మరింత దగ్గర చేశాయి. అదేంటో కానీ ఈ ఇద్దరూ కలిసి ఏ సినిమాలో నటించినా వీళ్లిద్దరి మధ్య ఉండే అనుబంధం ఎంతో నాచురల్గా ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీరిద్దరి జోడి కి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. దశాబ్ద కాలం నుంచి ఈ జోడి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మంచి విజయాలను అందుకుంటునే  వస్తున్నరు . ఇప్పటివరకు చాలానే సినిమాలు ఇద్దరు జోడి తో తెరకెక్కించి దర్శకుడు నిర్మాతలు మంచి విజయాలను అందుకున్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరి జోడి ఎప్పుడు ఎవర్గ్రీన్ గానే నిలిచిపోయింది. 

 

 

 ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో మొదటి సినిమా చంటి. ఈ సినిమాలో ఏమీ తెలియని అమాయకుడి పాత్రలో వెంకటేష్ నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఒక ధనవంతుల ఫ్యామిలీలో పుట్టిన మీనా వెంకటేష్ మధ్య నడిచే ప్రేమాయణం ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత సుందరకాండ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. ఈ  సినిమా కూడా ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత సూర్య వంశం అనే సినిమాలో కూడా మీనా వెంకటేష్ తో కలిసి నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్. చాలా ఏళ్ల తర్వాత మరోసారి విక్టరీ వెంకటేష్ దృశ్యం అనే సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా కూడా బంపర్ విక్టరీ సాధించింది. అందుకేనేమో ఈ జోడీ ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరెట్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: