టాలీవుడ్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన కాంబినేషన్ ఒకటి బాలకృష్ణ బీ గోపాల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లారీ డ్రైవర్ సినిమా అయితే ప్రేక్షులను ఇప్పటికి ఆకట్టుకుంటూ నే ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే ముందు మాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండే వారు. ఆ విధంగా ఈ కాంబినేషన్ హిట్ అయింది. నిర్మాతలు కూడా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసే వారు. దాదాపు వీరిద్దరూ కలిసి ఆరు సినిమాలు చేయగా ఆరు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ప్రతీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 

 

సినిమా సినిమాకు వీరిద్దరూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కథ ఉండటం తో విమర్శకుల ప్రసంశలు కూడా దక్కాయి. బాలకృష్ణ రేంజ్ బీ గోపాల్ మరింత పెంచారని మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసారని అక్కడి బాలయ్య తో సినిమా చేయడానికి చాలా మంది ఎదురు చూసే వారు అని అంటూ ఉంటారు. మన తెలుగు లో బాలకృష్ణ ఎంత మంది దర్శకుల తో సినిమా చేసినా సరే ఈ స్థాయిలో గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. మన తెలుగులో ఒక హీరోని ఈ స్థాయిలో మాస్ కి పరిచయం చేసిన దర్శకుడు ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు అనేది వాస్తవం. 

 

ఈ మధ్య వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే ప్రచారం జరిగింది. కాని ఆ సినిమా ముందుకు వెళ్ళే విధంగా కనపడటం లేదు. సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి వచ్చే లోపే లేదు అనే ప్రచారం కూడా బయటకు వచ్చింది. అప్పటి ప్రేక్షకులు వీరి కాంబినేషన్ కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: