టాలీవుడ్ లో ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన జంట... కృష్ణ శ్రీదేవి. దాదాపు వీరి కాంబినేషన్ లో 46 సినిమాలు రాగా ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కృష్ణా శ్రీదేవి జంట అనగానే నిర్మాతలకు పండగే. ఆ స్థాయిలో ఈ జోడీ ఆకట్టుకుంది. వీరితో కలిసి సినిమాలు చేసిన దర్శకులకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది అనేది వాస్తవం. వీరి సినిమాల్లో ఉండే పాటలు ఇప్పటికి కొన్ని ఇళ్ళల్లో వినపడుతూనే ఉంటాయి. కృష్ణ కెరీర్ లో విజయ నిర్మల తర్వాత ఆ స్థాయిలో దగ్గర అయింది ఈమెకే. 

 

వీరి సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి గానూ రాజకీయ నాయకులు కూడా అప్పట్లో ఆసక్తి చూపించే వారు అని అంటూ ఉంటారు. రాజకీయ నాయకులు ఎందరో కృష్ణ ను కలిసి శ్రీదేవి తో మీరు సినిమా చేస్తే తాము ఆర్ధిక సహకారం అందిస్తాం అని ముందుకు వచ్చిన సందర్భం కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విధంగా ఇద్దరూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మన తెలుగు దర్శకులతో పాటుగా బాలీవుడ్ దర్శకులు కూడా వీరి తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. 

 

అక్కడి దర్శకులు నిర్మాతలు కూడా వీరి తో సినిమా చేయడానికి గానూ సమయం కూడా కేటాయించినా సరే వీళ్ళు అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు. మన తెలుగు ప్రేక్షకులు వీరి కాంబినేషన్ ని బాగా దగ్గర చేసుకున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రతీ సినిమా కూడా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది అనే మాట అక్షరాలా నిజం. వీరి కాంబినేషన్ లో సినిమా టీవీ లో వచ్చినా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: