విజయ్ దేవరకొండ.. మనం అంత ఇతన్ని పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు లాగా, అర్జున్ రెడ్డి లాగా మాత్రమే చూశాం.. కానీ విజయ్ దేవరకొండ ఆ విజయం రావడానికి చాలా సమయం పట్టింది.. చాలా అంటే చాలా చాలా. ఏకంగా 8 ఏళ్ళు కష్టపడితే.. అప్పుడు ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు ఈ అర్జున్ రెడ్డి.. 

 

2010 నుండి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఒకో మెట్టు ఎక్కుతూ ఈరోజు స్టార్ హీరో రేంజ్ కి వచ్చాడు.. పేరులో విజయం ఉన్న.. ఆ విజయం దగ్గరకు రావడానికి ఏడేళ్లు కష్టపడ్డాడు.. ఒకటా రెండు ఆ? ఏకంగా ఏడేళ్లు.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులుకు ముందు నువ్విలా సినిమాలో నటించాడు.. ఎవడే సుబ్రహ్మణ్యంలో నటించాడు.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటించాడు.. 

 

కానీ ఎక్కడ ఫేమస్ కాలేదు.. నిజం చెప్పాలి అంటే ఎవడే సుబ్రమణ్యంలో విజయ్ దేవరకొండ నటించినందుకు అవార్డు వచ్చింది... కానీ ఎవరు అంత గుర్తించలేదు.. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ కాళ్లకు 
చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. శక్తి తెచ్చుకొని.. మళ్లీ మళ్లీ ప్రయత్నలు చేసి అవకాశాలు వచ్చేవరకు ప్రయత్నించాడు.. 

 

దాని ఫలితమే పెళ్లి చూపులు.. దాని ఫలితమే అర్జున్ రెడ్డి.. మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండకి ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు.. అంతే కాదు.. అవకాశాలు.. సమయం తీరికలేనన్ని వచ్చాయి.. అనుకుంటాం కానీ మళ్లీ మళ్లీ విజయం సాధిస్తున్నాడు.. గీత గోవిందం సినిమా అయితే మంచి రికార్డ్స్ సాధించింది.. ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. 

 

ఇటీవలే వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అయ్యింది కానీ ఇప్పుడు వచ్చే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్... ఇంకా బాలీవుడ్ హీరోయిన్.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి అని.. విజయ్ దేవరకొండ ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలి అని ఇండియా హెరాల్డ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: