IHG

సైనికుడు సినిమాలో కామెడీ విలన్ పాత్ర పోషించిన బాలీవుడ్ మరియు హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ బుధవారం తెల్లవారుజామున  తన నిజ జీవిత యాత్రను ముగించుకుని వెళ్లిపోయారు.1967, జనవరి 7వ తారీఖున జైపూర్ లో ఇర్ఫాన్ జన్మించారు.  ఇర్ఫాన్ ఖాన్ కు 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు పలువురు సినీ ప్రముఖులు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్ లో తన తుదిశ్వాస విడిచారు. హాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కి 2018లో బ్రెయిన్ క్యాన్సర్  (న్యూరో ఎండోక్రైన్)వచ్చింది. దానికోసం యుఎస్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు పూర్తిగా నయం కాకపోయినప్పటికీ ఆ జబ్బు మళ్ళీ తిరిగి వచ్చింది అయినా కూడా మళ్లీ తిరిగి చికిత్స చేయించుకున్నాడు.

IHG's the funniest of the lot - Movies News

 

అయితే రీసెంట్ గా కడుపులోని ప్రేగులు దెబ్బతినటంతో ఉన్నఫలంగా ముంబైలోని కోకిలబెన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరిస్థితి నిలకడగా ఉంది అనుకున్న టైంలో తన తల్లి ని కోల్పోయాడు.శనివారం రాజస్థాన్లోని జైపూర్లో తల్లి సైదా బేగం 95 మృతి చెందారు లాక్ డోన్ కారణంగా ముంబైలోనే చిక్కుకుపోయిన ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. మరియు అతని అస్వస్థత కారణంగా ఆ అంత్యక్రియలకు వెళ్లలేక తన తల్లిని వీడియో కాల్ ద్వారా చివరి చూపు చూచుచున్నాడు. ఇందుకుగాను తాను వెళ్లలేక పోయినందుకు తీవ్ర ఆవేదనకు గురి అయ్యాడు .అప్పటినుండి ఇర్ఫాన్ ఖాన్ నేను వచ్చిన పని ఇంక పూర్తి అయింది కాబట్టి  కుటుంబాన్ని చక్కదిద్దుకొని తిరిగి వెళ్లిపోతున్నానని బాధాతప్త హృదయంతో తన బయోగ్రఫీ బుక్ లో రాసుకున్నారు.

IHG

 

సైనికుడు సినిమాలో పప్పు యాదవ్ గా పరిచయమైన ఇర్ఫాన్ ఖాన్ సలాం బాంబే ఈ సినిమాతో తొలిసారిగా  బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. బాలీవుడ్ సినిమాలే కాకుండా స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్  ఫై, ఈ మైటి హార్ట్ వంటి హాలీవుడ్ చిత్రాలలో కూడా మంచి మంచి పేరు సంపాదించారు. అయితే ఈయన  నటించినటువంటి పాన్ సింగ్ తోమర్  సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ చివరిసారిగా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో నటించాడు. అంతేకాకుండా పలు టెలివిజన్ సీరియల్స్ లో కూడా ఆయన నటించాడు. అంతేకాకుండా పలు వీడియో గేమ్స్ లకు తన వాయిస్ ను అందించాడు. దేశీయంగానే కాకుండా పలు విదేశీ అవార్డులను ఈయన సొంతం చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: