బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్  ఆకస్మిక మరణం బాలీవుడ్ లో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన విషయం తెలిసిందే. భారత చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన ఇర్ఫాన్ ఖాన్  53 ఏళ్ల వయసులోనే కన్నుమూయడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. నాలుగు రోజుల కిందట ఇర్ఫాన్ ఖాన్ తల్లి చనిపోతే... ఇప్పుడు ఇర్ఫాన్ఖాన్ చనిపోవడం... ఆయన కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన నింపింది. ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగించిన ఇర్ఫాన్ ఖాన్ భారత చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతిని గడించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ గత రెండు నెలల క్రితమే కోలుకున్నారు. 

 

 ఇక కొన్ని రోజుల తర్వాత మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు ఇర్ఫాన్. పెద్ద పేగు వ్యాధి కి చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా లెజెండ్రీ నటుడు అయిన ఇర్ఫాన్ ఖాన్ మృతికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు కూడా ఇర్ఫాన్ కు సంతాపం తెలియజేశారు. ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి మహేష్ బాబు సైనికుడు సినిమా చేసిన విషయం తెలిసిందే. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఆయన సైనికుడు విలన్ గా నే ఎక్కువగా కొసమెరుపు.


ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఇర్ఫాన్ ఖాన్ మృతికి మహేష్ బాబు  సంతాపం తెలిపారు.టాలెంటెడ్ నటుడు  చాలా త్వరగా వెళ్ళిపోయాడు.. ఆకస్మిక మరణం ఎంతగానో బాధిస్తుంది. ఇది నిజంగా గుండె బద్దలయినంత పని అయింది... ఇర్ఫాన్ ఖాన్ మృతి  కి సంతాపం తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతేకాకుండా మంచు మనోజ్ కూడా ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త వినడం ఎంతో విషాదకరం అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: