సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం హీరో, హీరోయిన్ క‌లిసి ఒక‌టి, రెండు లేదా మ‌హా అయితే ఐదారు సినిమాలు న‌టించిన‌ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి న‌టించేందుకు బోర్‌గా ఫీల్ అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త హీరోయిన్స్ కోసం వెతుకుతుంటారు. కానీ, ఒక‌ప్పుడు ఓ జంట ప‌ది నుంచి ముప్పై సినిమాలు న‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంట కూడా ఒక‌టి. తెలుగు సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ ఓ సంచ‌ల‌నం అనే చెప్పాలి. 1984 నుంచి 1994 వరకు వీరిద్దరూ కలసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి.  వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. 

 

ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి కథానాయకుడు సినిమాలో తొలిసారి హీరో, హీరోయిన్లుగా కలిసి నటించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆ తర్వాత పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, భలే దొంగ, ముద్దుల మావయ్య , ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, తల్లి తండ్రులు, రౌడీ ఇన్‌స్పెక్టర్, చివరగా నిప్పురవ్వ సినిమాతో క‌లిసి న‌టించారు. ఈ 17 సినిమాల్లో రెండు సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాలు బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేశాయి.

 

ఇక‌ వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎంతో చ‌క్క‌గా వర్కవుట్ అవ్వ‌డంతో ప్రేక్ష‌కులు కూడా వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌చ్చిందంటే పండ‌గ చేసుకునే వారు. ఏదేమైనా అప్ప‌ట్లో బాల‌య్య‌తో విజ‌య‌శాంతి జ‌త క‌డితే ఆ సినిమా ద‌బిడిదిబిడే అని చెప్పుకోవ‌చ్చు. ఇక నిప్పుర‌వ్వ సినిమా తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో విజయశాంతి సినిమాలకి దూరం అయ్యి రాజకీయాలకి దగ్గర అవ్వగా, బాలయ్య ఆ రెండిటిలోనూ విజయవంతంగా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: