టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కథల కొరత ఏర్పడింది. మన్మధుడు 2 ప్లాప్ అవగా ఆ తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు నాగార్జున. ఇక సోల్మన్ డైరక్షన్ లో చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమాను కూడా సైలెంట్ గా చేస్తున్నాడు నాగ్. సోగ్గాడే చిన్ని నాయనా సూపర్ హిట్ కాగా.. ఊపిరి యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత నాగార్జున చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. ఆఫీసర్, మన్మధుడు 2 లాంటి సినిమాలు అయితే మరీ దారుణంగా పోయాయి. 

 

ఇక వైల్డ్ డాగ్ తో పాటుగా మరో సినిమా చేసేందుకు దర్శకులను కథలు వినిపించమని అడిగాడట. సీనియర్ డైరక్టర్స్ నుండి కొత్త దర్శకుల వరకు నాగార్జునకు దాదాపు 50 కథల దాకా వినిపించారట. అయితే వాటిలో 45 కథలు నచ్చలేదని చెప్పాడట. మరి అన్ని కథలు విన్నా కేవలం 5 మాత్రమే నచ్చడంపై అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈసారి కొడితే గట్టిగా కొట్టాలనే కసితో ఉన్న నాగార్జున కథల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదని తెలుస్తుంది. 

 

మరోపక్క సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా అనుకున్న బంగార్రాజు సినిమా కూడా సెట్ మీదకు వెళ్లేట్టు కనిపించడం లేదు. సోగ్గాడితో హిట్ అందుకున్న నెల టిక్కెట్టు ప్లాప్ అవడంతో కళ్యాణ్ కృష్ణ మీద నాగ్ నమ్మకం ఉంచట్లేదని తెలుస్తుంది. మరి వైల్డ్ డాగ్ అంచనాలను అందుకుని నాగార్జునని హిట్ ట్రాక్ లోకి తెస్తుందో లేదో చూడాలి. ఎప్పుడు ప్రయోగాలకు ముందుండే నాగార్జున ఇక మీదట అలంటి ప్రయోగాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. ఎప్పుడు ప్రయోగాలకు ముందుండే నాగార్జున ఇక మీదట అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: