తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కథానాయికల్లో ఒకరు సాయి పల్లవి. వాస్తవంగా డాన్సర్ అయిన సాయి పల్లవి ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టి హీరోయిన్గా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే నేటి తరం హీరోయిన్లలో చాలామంది పొట్టి డ్రెస్ లు  వేసుకుని తన అందాలను ఒలకబోయటానికి  ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది అందాల ఆరబోత చేసి మరిన్ని అవకాశాలను చేజిక్కింకుంటూ ఉంటారు. కానీ వీటన్నింటికీ సాయి పల్లవి మాత్రం పూర్తిగా విరుద్ధం. అవకాశాలు ఉన్నా లేకున్నా అందాల ఆరబోతకు మాత్రం దూరంగానే ఉంటుంది ఈ అమ్మడు. 

 

 మొదటి నుంచి కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అందాలు ఆరబోయడం వయ్యారాలు ఒలకబోయడం  తనవల్ల కాదు అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మామూలుగానే సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రల్లో  నటిస్తూ నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది సాయి పల్లవి. ఇక పాత్రలో గ్లామర్ గా  కనిపించడంలో మొదటి నుంచి ఒక పరిధిని దాటకుండా ముందుకు సాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి  హాజరైన సాయిపల్లవి మాట్లాడుతూ... మొదటి నుంచి కూడా తెర పైన తాను ఒక సాధారణమైన కాలేజీ అమ్మాయిల కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది. 

 


 పొట్టి బట్టలు ధరించడం గాని శృతిమించిన అందాల ఆరబోత కానీ తనకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ తెలిపింది. ఫిదా సినిమాలో ఒక సీన్లో పొట్టి డ్రెస్ వేసుకున్నాను.  ఆ సన్నివేశానికి ఎంతో ముఖ్యం కాబట్టి తప్పలేదు. కానీ అలాగే మరో సినిమాలో కనిపించాలి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ పొట్టి డ్రెస్ వేసుకుంటే అవకాశాలు వస్తాయి  అంటే మాత్రం సినిమాలు వదులుకోవడానికి కూడా సిద్ధమే అని చెబుతోంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: