సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. మొదటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను అందుకుని  దూసుకుపోతుంటే  మహేష్ బాబు  కూడా ఆచితూచి కథలు ఎంపిక చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న దూసుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సారి బ్లాక్ బస్టర్ ఖాయం అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి  మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు అభిమానులు అందరూ సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి తో పాటు మరో పండుగ జరుపుకున్నారు అనే చెప్పాలి . ముఖ్యంగా సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం తో పాటు ఫ్యామిలీ  ఎమోషన్స్ లో కూడా ఇరగదీశారు మహేష్ బాబు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదటిసారి టాలీవుడ్ బ్యూటీక్వీన్ రష్మిక మందన నటించింది.తనదైన  క్యూట్ క్యూట్ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది ఈ సినిమాలో రష్మిక. 

 

 ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా లోని హిస్  సో క్యూట్ అనే పాట అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షించి దూసుకుపోయింది. ఈ సో క్యూట్ అనే లిరికల్ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ చేసినట్లుగా నిర్మాత బి.ఎ.రాజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మొదటినుంచి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ పాట మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: