నేడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి అభిమానులకు ప్రముఖులకు అందరినీ షాక్ గురి చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. నేడు ముంబై నగరంలోని కోకిలాబెన్  ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో మృతి చెందాడు. ఇర్ఫాన్ మృతిపట్ల.. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు సంతాపం తెలియచేశారు. అలాగే ఇర్ఫాన్ మృతి పట్ల ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఇర్ఫాన్ మరణం సినిమా రంగంలో తీరని లోటు అని తెలియజేశారు. సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రతిభను చాటుకున్న ఇర్ఫాన్ ఖాన్ అందరి మనసులో గుర్తుండి పోతాడు అంటూ, ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలి అని ట్విట్టర్ వేదికగా చేసుకొని సంతాపం తెలియజేశాడు. 

 


ఇర్ఫాన్ మృతిపై హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఇర్ఫాన్ మృతి నాకు చాలా ఆవేదనకు గురి చేసింది అంటూ అమీషా తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు అంటూ ఇర్ఫాన్ కొనియాడాడు. ఇర్ఫాన్ మృతితో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోవడం జరిగింది అని అమీషా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 

 

 

ఇక ఇటీవలే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం కూడా మృతి చెందారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో కన్నతల్లిని చివరిసారిగా కూడా చూసుకోలేక పోయాడు ఇర్ఫాన్ ఖాన్. ఇక తల్లి మృతి చెందిన నాలుగు రోజులకే ఇర్ఫాన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంతా కన్నీరు మున్నీరయ్యారు. అలాగే ఇర్ఫాన్ ఆత్మకు శాంతి చేకూరాలని అమిత్ షా ప్రార్థించడం జరిగింది. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, చిరు కూడా ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా నేను ఇర్ఫాన్ కు ఒక వీర అభిమానిని అంటూ కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: