ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అరుదైన రికార్డుని అందుకున్నాడు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలు జనాలని బాగా ఆకర్షిస్తున్నాయి. అందువల్ల ఇక్కడ హిట్ అయిన సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలని కూడా డబ్ చేసి వదులుతున్నారు. అయితే అనూహ్యంగా ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి హిందిలో రెస్పాన్స్  సూపర్ గా వస్తుంది.  ఒక్కో సినిమాకి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. 

 

స్టార్ హీరో నుండి మొదలుకుని, చిన్న సినిమా హీరో వరకూ అక్కడ ఒకే రకమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక మాస్ సినిమా అయితే యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే. అల్లు అర్జున్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కి ౨౫౦ మిలియన్స్ కి పైగా వ్యూస్ అందుకుంది. దక్షిణాదిన తెరకెక్కే మాస్ సినిమాలని అక్కడి జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ అరుదైన రికార్డుని అందుకున్నాడు.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రామ్ కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది. ఇటు వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీకీ, చాక్లెట్ బాయ్ తరహా పాత్రలే చేస్తున్న రామ్ కీ మంచి విజయాన్ని అందించింది. ఆదిత్య మూవీస్ ద్వారా హిందీలో డబ్ అయిన ఈ సినిమా హిందీ జనాలకి బాగా నచ్చేసింది. రామ్ పర్ ఫార్మెన్స్ తో పాటు నభా నటేష్, నిధి అగర్వాల్ ల అందాలు తోడై సినిమాకి ౪౫ రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్ ని దాటేలా చేసాయి. 

 

దీంతో రామ్ హీరోగా నటించిన నాలుగవ చిత్రం వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. అంతకుముందే ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా వంద మిలియన్స్ ని దాటేసి, ఒకే హీరోకి చెందిన నాలుగు సినిమాలు ఈ ఫీట్ సాధించి రికార్డుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: