ఈరోజు బాలీవుడ్ లెజెండ్రీ నటుడు ఇర్ఫాన్ ఖాన్  ఆరోగ్య పరిస్థితి విషమించిన  కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్  మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు ఇర్ఫాన్ కుటుంబంలో  కూడా తీవ్ర విషాదం నిండిపోయింది. ఎందుకంటే మూడు రోజుల కిందటే ఇర్ఫాన్ ఖాన్  కన్నతల్లి సాయెదా బేగం  చికిత్స పొందుతూ మరణించింది.. ఇక ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్  కూడా చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఇక ఇర్ఫాన్ ఖాన్  మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 

 


 ఇక ఇర్ఫాన్ ఖాన్ మృతి పై ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు వివిధ సినిమా ఇండస్ట్రీలకు  చెందిన ప్రముఖులు స్పందిస్తూ లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్  మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అయినా హృతిక్ రోషన్ ఇర్ఫాన్ ఖాన్ మరణం పై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ తో  తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హృతిక్ రోషన్. మనిద్దరి మధ్య ఎన్నో సార్లు సంభాషణలు జరిగాయి. ప్రస్తుతం నీ మరణం గురించి రాస్తున్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. మీలాంటి వారు  చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఒక అరుదైన గొప్ప మనిషి. నేను మిమ్మల్ని కోల్పోతానని అస్సలు అనుకోలేదు. ప్రామాణికమైనది అంటే అర్థం ఏమిటో నాకు చూపించినందుకు ధన్యవాదాలు ఇర్ఫాన్. రెస్ట్  ఇన్  పీస్ అంటూ హృతిక్ రోషన్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. 

 


 ఇక ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఇర్ఫాన్ ఖాన్  మృతి పై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ ఆకస్మిక మృతితో అటు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. మీరు చనిపోవచ్చు కానీ మా హృదయాలలో ఎప్పటికి బతికే ఉంటారు అంటూ అభిమానులు ఇర్ఫాన్ ఖాన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. పెద్ద పేగు వ్యాధి కారణంగా ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరిన ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు ఇర్ఫాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: