టాలీవుడ్ చుట్టూ ఇపుడు అందరి ఆలోచనలూ సాగుతున్నాయి. టాలీవుడ్ ఎలా ఉంటుంది. దాని మంచి చెడ్డలేంటి, రానున్న రోజుల్లో తళుకు బెళుకులు ఎలా ఉంటాయి. దాదాపు ఎనభైయేళ్ళ పై చరిత్ర కలిగిన టాలీవుడ్ ఎలా తన పయనాన్ని సాగిస్తుంది, తన కీర్తిని ఎలా కాపాడుకుంటుంది. 

 

ఇవన్నీ ప్రశ్నలే. టాలీవుడ్లో ఇపుడు లాక్ డౌన్ అతి పెద్ద  నష్టం అంటున్నారు. అయితే ఎంత నష్టం ఎవరికి నష్ట, ఏ విధంగా నష్టం వంటి చర్చ కూడా సాగుతోది. బయట ప్రపంచం మాదిరిగానే లాక్ డౌన్ పెద్ద తలకాయలకు ఇబ్బంది పెట్టదు. వారు కొన్నాళ్ళు కాకపోతే కొన్నేళ్ళు ఉండగలరు, ఇక చిన్నా చితకా మాత్రం వెంటనే దొరికిపోతారు అంటున్నారు.

 

ఇక మరో వైపు చూసుకుంటే సినిమా హాళ్ళు కూడా పూర్వంలా కళకట్టవని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే టాలీవుడ్లో ఉన్న వారిలో నట వార‌సులు, రుద్దుడు బ్యాచ్ మెజారిటీ ఉన్నారు. దాంతో వారి సంగతేంటి అన్న చర్చ కూడా ఉంది. ఫలనా వారి వారసులు అంటూ రిఫరెన్స్ తీసుకుని వచ్చిన వారికి మాత్రం ఇది ఇబ్బందికరమేనని అంటున్నారు.

 

వారితో సినిమాలు తీయడానికి నిర్మాతలు గతంలో మాదిరిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేరని, ఆలోచన చేయలేరని కూడా అంటున్నారు. దాంతో వారి కెరీర్ అర్జంట్ గా ప్రశ్నార్ధకం కాబోతోందని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూసుకుంటే టాలీవుడ్లో చిన్న ఆర్టిస్టులు టాలెంట్ ఉన్నా కూడా సరైన మార్కెట్ లేని వారి స్థితి కూడా ఇంతేనని మాట వినిపిస్తోంది.

 

మొత్తానికి లాక్ డౌన్ ఒక్క సినీ కార్మికుల పొట్టను మాత్రమే కొట్టదని, మొత్తానికి మొత్తం ఎనభై శాతం పరిశ్రమను అతలాకుతలం చేస్తుందని అంటున్నారు. మరి దీని నుంచి టాలీవుడ్ ఎలా బయటపడుతుంది, బతికిబట్ట కడుతుంది అన్నది ఆలోచించాల్సిన విషయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: