టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజానికి పెళ్లికాని ప్రసాదులు నిజంగా చాల మందే ఉన్నారు. ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో కాదు దేశ వ్యాప్తంగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెళ్లి విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక తన పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న వాటిపై స్పందించడం జరిగింది. ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు పెళ్లి అంటే ఎలాంటి అఇష్టం లేదని ... నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడు చూసుకుంటాను తెలియదు. ఇటీవల నిహారిక, అనుష్క, భీమావరం అమ్మాయితో సంబంధం గురించి వస్తున్న వార్తలను చూసుకొని నవ్వుకున్నాను అని తెలిపారు ప్రభాస్.

 

 

నిజానికి ప్రస్తుతం ప్రభాస్ కు 40 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. ఇలా ఎన్ని రోజులు తన పెళ్లిని పోస్ట్ ఫోన్ చేస్తాడో ఎవరికీ అరథం అవ్వడం లేదు. దీనికి కారణం ఆయనకు నచ్చిన అమ్మాయి దొరక్కనో ఇంకా ఏదో కారణంతో మాత్రం ఆయన తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒక చిరు నవ్వు నవ్వి ఉరుకుంటున్నాడు. నా పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల కంటే సోషల్ మీడియా వాళ్లకి ఆత్రుత ఎక్కువ ఉంది అంటూ ప్రభాస్ తెలిపాడు. 

 

 

నిజానికి నెను పెళ్లి చేసుకుంటానో లేదో కూడా మీడియా చెప్పేస్తుంది అంటూ నవ్వుతూ అన్నాడు. ప్రస్తుతం మాత్రం నా పెళ్లి విషయంలో ఎటువంటి ఆలోచన లేదు అని తెలిపాడు. గత కొన్ని రోజులుగా ప్రభాస్, నాగబాబు కూతురు నిహారికతో పెళ్లి జరుగుతున్నట్లు వచ్చిన వార్తలకు నిహారిక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల ఆన్లైన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నిహారిక తెలిపింది. నేను ప్రభాస్ ను ప్రేమించలేదు.. అలాగే మా ఇద్దరికి పెళ్లి అని వచ్చిన వార్తలు అన్ని కూడా అవాస్తవము అని తెలియజేసింది. దీనితో ఆ సమస్యకు పెద్ద పరిష్కారమే ఇచ్చింది నిహారిక.

 

మరింత సమాచారం తెలుసుకోండి: